US Embassy : ఇరాక్‌లో అమెరికా రాయబార కార్యాలయంపై క్షిపణి దాడి

ఇరాక్ ఉత్తర ప్రాంతం ఇర్బిల్‌లో అమెరికా కొత్తగా రాయబార కార్యాలయాన్ని నిర్మించింది. దాన్ని టార్గెట్ చేసుకునే మిసైల్ దాడులు జరిగాయి.

US Embassy : ఇరాక్‌లో అమెరికా రాయబార కార్యాలయంపై క్షిపణి దాడి

Iraq

US embassy : యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఇరాక్‌లో అమెరికా రాయబార కార్యాలయం టార్గెట్‌గా క్షిపణుల దాడి జరగడం కలకలం రేపుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 మిస్సైల్స్‌ను యూఎస్ కాన్సులేట్‌ వైపుగా ప్రయోగించారు. ఇరాన్ వైపు నుంచే క్షిపణి దాడి జరిగినట్టు అమెరికా అనుమానిస్తోంది.

అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదు. ఇరాక్ ఉత్తర ప్రాంతం ఇర్బిల్‌లో అమెరికా కొత్తగా రాయబార కార్యాలయాన్ని నిర్మించింది. దాన్ని టార్గెట్ చేసుకునే మిసైల్ దాడులు జరిగాయి. అయితే ఈ భవనం నుంచి అమెరికా ఇంకా ఎలాంటి కార్యకలాపాలను ప్రారంభించలేదు. దీంతో ప్రాణనష్టం తప్పింది.

Iraq : అమెరికా రాయబార కార్యాలయంపై రాకెట్ దాడి

ఇటీవల జరిగిన సిరియా డమాస్కస్‌లో ఇజ్రాయిల్ ఎయిర్ స్ట్రైక్‌లో ఇద్దరు ఇరాన్ రెవెల్యూషనరీ గార్డులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అప్పుడే ప్రకటించింది. అందులో భాగంగానే క్షిపణులతో విరుచుకుపడినట్టు అమెరికా అనుమానిస్తోంది.