Moderna Covid-19 Vaccine: పిల్లలకు వేసేందుకు అప్రూవల్ దక్కించుకున్న మోడర్నా వ్యాక్సిన్‌

కరోనా థర్డ్‌వేవ్‌ భయాల నడుమ ఊరటనిచ్చే వార్త వెలువడింది. పిల్లలు అత్యవసరంగా వాడేందుకు మరో కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అమెరికా ఫార్మా దిగ్గజం మోడెర్నా తయారు చేసిన పిల్లల వ్యాక్సిన్‌కు యూరోపియన్ యూనియన్ ఆమోదం తెలిపింది.

Moderna Covid-19 Vaccine: పిల్లలకు వేసేందుకు అప్రూవల్ దక్కించుకున్న మోడర్నా వ్యాక్సిన్‌

moderna

Moderna Covid-19 Vaccine: కరోనా థర్డ్‌వేవ్‌ భయాల నడుమ ఊరటనిచ్చే వార్త వెలువడింది. పిల్లలు అత్యవసరంగా వాడేందుకు మరో కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అమెరికా ఫార్మా దిగ్గజం మోడెర్నా తయారు చేసిన పిల్లల వ్యాక్సిన్‌కు యూరోపియన్ యూనియన్ ఆమోదం తెలిపింది. 12 నుంచి 17 ఏళ్ల వయసున్న పిల్లలు వినియోగించేందుకుగానూ మోడెర్నా సంస్థ స్పైక్‌వాక్స్ పేరుతో టీకాను అభివృద్ధి చేసింది.

క్లినికల్ ట్రయల్స్‌లో దాని సమర్థత నిరూపణ కావడంతో ఆ టీకాకు యురోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ ఆమోదం తెలిపింది. 18 ఏళ్లు పైబడినవారు మోడెర్నా టీకాలను ఎలాగైతే వేసుకుంటారో, ఈ స్పైక్‌వాక్స్‌ను కూడా ఇంజెక్షన్ల రూపంలోనే రెండు డోసుల్లో పిల్లలకు అందజేయనున్నారు. మొత్తం 3వేల 732 మంది 12 నుంచి 17 ఏళ్ల పిల్లలపై స్పైక్ వాక్స్ టీకాను ప్రయోగించి చూశారు. వీరిలో 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు గలవారిలో మాదిరిగానే యాంటీ బాడీల పెరుగుదల కనిపించిందని ఈఎంఏ పేర్కొంది. పిల్లల కోసం యూరోపియన్ యూనియన్ ఆమోదించిన రెండో వ్యాక్సిన్ ఇది.

ఈ ఏడాది మే నెలలో ఫైజర్ పిల్లల టీకాకు ఈయూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇటు భారత్ లోనూ పిల్లలకు టీకాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి. జైడస్ క్యాడిల్లా సంస్థ రూపొందించిన డీఎన్ఏ ఆధారిత జైకోవ్-డీ కరోనా వ్యాక్సిన్‌ 12 నుంచి 18 ఏళ్ల వారికి ఉపయోగించేందుకు క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసినట్లు కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. ట్రయల్స్‌ పూర్తయిన వెంటనే పిల్లల వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.