Youtube : క్రియేటర్లకు డబ్బే.. డబ్బు.. సరికొత్త ఫీచర్ ను అదుబాటులోకి తెచ్చిన యూట్యూబ్

మంచి మంచి వీడియోలను రూపొందిస్తున్న క్రియేటర్లకు వీక్షకులు డబ్బు డొనేట్ చేయటం ద్వారా వారి ఛానల్ నిర్వాహణకు మద్దతు తెలియజేసినట్లవుతుంది.

Youtube : క్రియేటర్లకు డబ్బే.. డబ్బు.. సరికొత్త ఫీచర్ ను అదుబాటులోకి తెచ్చిన యూట్యూబ్

Youtube

Youtube : కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సూర్ థ్యాంక్స్ పేరుతో తీసుకువచ్చిన ఈ ఫీచర్ ద్వారా వీక్షకులు క్రియేటర్లకు ప్రోత్సాహకంగా 150 రూపాయల నుండి 3730 రూపాయల వరకు చెల్లించవచ్చు. యూట్యూబ్ తీసుకువచ్చిన ఈ ఫీచర్ తో యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లు వీక్షకుల నుండి డబ్బు సంపాదించేందుకు అవకాశం కలగనుంది.

ప్రస్తుతం సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంపై షార్ట్ వీడియో కంటెంట్ కు మంచి డిమాండ్ ఉంది. వీక్షకులు తక్కువ నిడివి కలిగిన వీడియోలను చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. వారి ఆసక్తికి తగ్గట్టుగా క్రియేటర్లు మంచి కంటెంట్ ను అందించేందుకు టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ వంటి సంస్ధలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే వీటికి పోటీగా తమ క్రియేటర్లను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే యూట్యూబ్ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది.

మంచి మంచి వీడియోలను రూపొందిస్తున్న క్రియేటర్లకు వీక్షకులు డబ్బు డొనేట్ చేయటం ద్వారా వారి ఛానల్ నిర్వాహణకు మద్దతు తెలియజేసినట్లవుతుంది. సూపర్ ధ్యాంక్స్ ఫీచర్ నుండి డబ్బు డొనేట్ చేస్తే వారి పేర్లు కామెంట్ సెక్షన్ లో హైలెట్ గా కనిపించనున్నాయి. యూట్యూబ్ కొత్త గా తీసుకు వచ్చిన ఈ ఫీచర్ 68 దేశాలలో అందుబాటులోకి రానుంది. యూట్యూబ్ తీసుకువచ్చిన కొత్త ఫీచర్ ఎంతగానో తోడ్పడుతుందని క్రియేటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.