Hubble Space Telescope: నెల తర్వాత మళ్ళీ పనిచేస్తున్న నాసా స్పేస్ టెలిస్కోప్!

నాసా హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఒక నెల తర్వాత మళ్ళీ పనిచేస్తోంది. ఒక నెల పాటు పనిచేయకపోయిన ఈ స్పేస్ టెలిస్కోప్ తిరిగి ఆన్‌లైన్‌లోకి రావడంతో నాసా శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. తిరిగి పనిచేస్తుందని సంకేతాలు ఇచ్చేందుకు టెలిస్కోప్ ద్వారా క్లిక్ చేసిన కొన్ని ఫోటోలను విడుదల చేసింది.

Hubble Space Telescope: నెల తర్వాత మళ్ళీ పనిచేస్తున్న నాసా స్పేస్ టెలిస్కోప్!

Hubble Space Telescope

Hubble Space Telescope: నాసా హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఒక నెల తర్వాత మళ్ళీ పనిచేస్తోంది. ఒక నెల పాటు పనిచేయకపోయిన ఈ స్పేస్ టెలిస్కోప్ తిరిగి ఆన్‌లైన్‌లోకి రావడంతో నాసా శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. తిరిగి పనిచేస్తుందని సంకేతాలు ఇచ్చేందుకు టెలిస్కోప్ ద్వారా క్లిక్ చేసిన కొన్ని ఫోటోలను విడుదల చేసింది. జూన్ 13న ఇది ఆఫ్‌లైన్‌లోకి వెళ్లగా నెలకు పైగా ఇది ఎలా పనిచేసిందన్నది సమాచారం దొరకలేదు.

అయితే.. ఇంజనీర్లు గత గురువారం దాని బ్యాకప్ హార్డ్‌వేర్‌లను సక్రియం చేయడం ద్వారా తిరిగి ఆన్‌లైన్‌లోకి తీసుకురాగలిగారు. ఇప్పుడు స్పేస్ టెలిస్కోప్ పనిచేయకుండా పోయిన ఈ నెలరోజుల సమయంలో ఏం జరిగిందో గుర్తించడానికి చాలా కష్టపడుతున్న ఇంజనీర్లు.. దీని వెనుక ఉన్న లోపాలను గుర్తించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నాసా హబుల్ ఆఫ్‌లైన్‌లోకి వెళ్లడానికి కారణమేమిటో ఇంకా ప్రకటించకపోగా త్వరలోనే దీనివెనుక ఉన్న లోపాన్ని గుర్తించి ప్రకటించే అవకాశాలున్నాయి.

ఓ ఇంటర్వ్యూలో నాసా ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రస్తుతం హబుల్ స్పేస్ టెలిస్కోప్ పూర్తిగా పనిచేస్తుందని.. గత వారాంతంలో నెమ్మదిగా దాని సైన్స్ పరికరాలను తిరిగి శక్తివంతం చేసుకోగలిగిందని చెప్పారు. ఇందులో ప్రతిదీ సరిగ్గా పనిచేస్తుందని నిర్ధారించడానికి సిస్టమ్ చెక్-అవుట్లను నిర్వహించగా.. అది ఒక నెల రోజులు పనిచేయలేదని తేలిందని చెప్పారు. ఇక శనివారం ఈ టెలిస్కోప్ అసాధారణమైన గెలాక్సీల సమితి చిత్రాలను తీసి పంపగా అందులో ఒకటి ఒక జత గెలాక్సీలు నెమ్మదిగా ఢీకొంటున్నట్లు చూపిస్తుందని..ఈ టెలిస్కోప్ బృహస్పతి ఉత్తర, దక్షిణ దీపాలను (అరోరాస్) అలాగే నక్షత్రాల గట్టి సమూహాలను కూడా గమనిస్తోందని చెప్పారు.

కాగా, నెల రోజులు పనిచేయని అబ్జర్వేటరీలో ఏ హార్డ్‌వేర్ సమస్య ఉందో నాసా ఖచ్చితంగా ప్రకటించలేదు కానీ.. నివేదికల ప్రకారం, హబుల్ యొక్క పవర్ కంట్రోల్ యూనిట్ లో విఫలమైన భద్రత పేలోడ్ కంప్యూటర్‌ మూలంగానే సమస్య తలెత్తి ఉండవచ్చని ఇంజనీర్లు అనుమానిస్తున్నారు. నాసా ప్రస్తుతానికి సమస్యను పరిష్కరించగలిగి ఉండవచ్చు, కానీ ఇది ఒకరకంగా హెచ్చరికలాంటిదని ఓ శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు. ఈ టెలిస్కోప్ సాంకేతికంగా 2009 నుండి అప్‌గ్రేడ్ చేయబడలేదని.. దీనిపై నాసా మరోసారి ఆలోచన చేయాల్సి ఉందని పేర్కొన్నారు.