US space agency: కేజీ మట్టి విలువెంతో తెలుసా? ఆరున్నర లక్షల కోట్లు!

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువును భూమి మీదకు తీసుకురాబోతోంది. అంగారక గ్రహం నుంచి సేకరించిన దుమ్ము మరియు మట్టిని భూమి మీదకు తీసుకుని వస్తుంది నాసా.

US space agency: కేజీ మట్టి విలువెంతో తెలుసా? ఆరున్నర లక్షల కోట్లు!

Nasa Will Spend 9 Billion Dollar To Bring The Soil Of Mars To Earth

NASA: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువును భూమి మీదకు తీసుకురాబోతోంది. అంగారక గ్రహం నుంచి సేకరించిన దుమ్ము మరియు మట్టిని భూమి మీదకు తీసుకుని వస్తుంది నాసా. ఇదే జరిగితే, ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పదార్థం భూమి మీదకు వచ్చినట్లు అవుతుంది. ఈ మట్టిని భూమికి తెచ్చిన తరువాత, దాని ద్వారా చాలా పరిశోధనలు జరుగుతాయి.

నాసా మూడు మిషన్లలో మార్స్ నుండి 2 పౌండ్ల(ఒక కిలోగ్రాము) మట్టిని భూమి మీదకు తెస్తుంది. అంగారక గ్రహంపై పురాతన జీవుల జాడలను పరిశోధించడానికి నాసా ఈ మట్టిని భూమికి తీసుకువస్తుంది.

నాసా మూడు మిషన్లను పైకి తీసుకుని వెళ్లేందుకు 9 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది.
అంగారక గ్రహం నుంచి రెండు పౌండ్ల మట్టిని తీసుకురావడానికి, రెండు పౌండ్ల బంగారం ఖర్చు కంటే రెండు లక్షల రెట్లు ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది.
ఇప్పటివరకు అంగారక గ్రహంపై ఉన్న రోవర్ ద్వారా ఉపరితల సమాచారం సేకరిస్తున్నారు.

మొత్తం మూడు దశలలో ఈ ప్రాజెక్టు ఉండబోతుండగా.. శాంపిల్ మట్టి సేకరించేందుకు రెండేళ్లు పడుతుంది. ఆ మట్టిని భూమ్మీదకు తేవడానికి పదేళ్ల సమయం పట్టవచ్చు అని అంటున్నారు.