నాసా ప్రయోగం, అంగారక గ్రహంపై మార్స్ రోవర్

నాసా ప్రయోగం, అంగారక గ్రహంపై మార్స్ రోవర్

NASA : అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన మార్స్ రోవర్ విజయవంతంగా ల్యాండ్ అయింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2గంటల 25నిమిషాల సమయంలో మార్స్ రోవర్ అంగారక గ్రహంపై విజయవంతంగా ల్యాండ్ అయింది. అంగారకుడిపై గ్రహాంతర జీవుల ఆనవాళ్లను తెలుసుకునేందుకు నాసా ఏడు నెలల క్రితం ఈ ప్రయోగాన్ని చేపట్టింది. అయితే అప్పుడు ప్రయోగించిన ఈ మార్స్ రోవర్ ఈ రోజు కక్ష్యలో ప్రయాణించి లక్ష్యానికి చేరువైందని.. చివరి ఏడు నిమిషాల గండాన్ని సైతం అధిగమించందని నాసా వెల్లడించింది.

అంగారకుడిపై గ్రహాంతర జీవుల ఆనవాళ్లు, అక్కడి వాతావరణాన్ని కనుగొనేందుకు నాసా రోబో మార్స్‌ రోవర్‌ను ప్రయోగించింది. ఈ రోవర్ అంగారక గ్రహంలోని జెజెరో క్రేటర్ అనే ప్రదేశంలో విజయవంతంగా ల్యాండ్ అయి అంతరిక్ష నౌక నుంచి విడిపోయింది. ఈ ప్రయోగానికి నాసా దాదాపు 17వేల కోట్లు ఖర్చు చేసింది. ఈ ప్రయోగంలో ఓ భారత సంతతి మహిళ ఓ క్లిష్టమైన విభాగంలో పని చేస్తోంది. పర్సీవరెన్స్ రోవర్ ల్యాండింగ్ ఇంఛార్జీగా భారత సంతతికి చెందిన మహిళ డాక్టర్ స్వాతి మోహన్ బాధ్యతలు నిర్వరిస్తున్నారు.

భారత సంతతికి చెందిన మహిళ ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషించడం దేశానికే గర్వకారణమంటున్నారు. పెర్సర్వరెన్స్ రోవర్ విజయవంతంగా ల్యాండ్ అయిన అనంతరం నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ స్టీవ్ జుర్జిక్ బృందాన్ని అభినందించారు. జూలై 30, 2020 న ప్రారంభమైన మార్స్ రోవర్ ప్రయాణం.. ఈ రోజు విజయవంతమైందని వెల్లడించారు.