అనారోగ్యంతో కోలుకోలేని చిన్నారుల్ని చంపేసుకోవచ్చు..! సంచలన చట్టం..!!

10TV Telugu News

Netherland : ప్రపంచంలో ఏ దేశం చేయనటువంటి సాహసం..ఇప్పటి వరకూ ఏ దేశ ప్రభుత్వం తీసుకోనంటువంటి సంచలన నిర్ణయం తీసుకుంది నెదర్లాండ్ ప్రభుత్వం. దీర్ఘ కాలం వ్యాధితో బాధపడుతున్న చిన్నారును..నయం చేయలేని రోగం ఉన్న 12 ఏళ్లలోపు చిన్నారులను చంపేయవచ్చనే చట్టం తీసుకువచ్చారు. డచ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం కొత్త చర్చకు దారితీసింది. సంచలనంగా మారింది. చిన్నారులకు రోగం నయం కాకపోతే చంపేయడం ఏంటని ఇది చాలా దారుణమైన నిర్ణయమని విమర్శలు వస్తున్నాయి.


దీర్ఘకాలంగా వైద్యం చేయించినా ఎటువంటి మెరుగు లేకపోయినా..తగ్గని రోగాలతో చిన్నారులు బాధపడుతున్నా..కన్నవారి కళ్లముందే చిన్నారులు బాధపడుతుంటే చూసి తట్టుకోలేకపోయినా..వైద్యుల సాయంతో స్వాంతన మార్గంలో ముగించేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇలా చేయాలంటే సదరు అనారోగ్యంతో బాధపడే చిన్నారుల తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని స్పష్టంచేశారు.


కాగా గతంలోనే ఇలాంటి చట్టం ఉండేది. కానీ ఒక సంవత్సరం వరకు ఉన్న పిల్లలను ఈ మార్గం ద్వారా చంపటానికి అనుమతి ఉండేది. కానీ ఇటీవల ఈ చట్టంలో సవరణ చేయాలని నెదర్లాండ్ ఆరోగ్య మంత్రి హ్యూగో డీ జోంగ్ ప్రతిపాదించారు. దీన్ని సంవత్సరం చిన్నారుల నుంచి 12 సంవత్సరాల వయస్సు వరకు పెంచుతూ చట్టాన్ని ఆమోదించారు.


కోలుకునే అవకాశం లేని చిన్నారులు కన్నవారి కళ్లముందే నరకయాతన పడుతుంటే ఆ కన్నవారి మానసిక ఆవేదన వర్ణించలేది..మాటలకు అందనిది అలా వారి జీవితాంతం ఆ పిల్లలతో బాధపడేకంటే ఈ విధమన మార్గంతో వారికి ఇలా విముక్తి కల్పించాలని చట్టంలో పేర్కొన్నారు. కాగా ఈ చట్టానికి నిపుణులు..ప్రజా ప్రతినిధులు కూడా అంగీకారం తెలిపారు. కానీ ఇటువంటి చర్య మంచిది కాదనీ దీన్ని అడ్డం పెట్టుకుని నేరాలు కూడా జరిగే అవకాశముందని కొన్ని స్వచ్ఛంద సంస్థలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి.


కాగా..నెదర్‌లాండ్స్‌లో ప్రతి ఏటా 5 నుంచి 10 మంది పిల్లలు దీర్ఘకాలిక వ్యాధితో భారంగా జీనం సాగిస్తున్నారు. అలాంటి బాధలను అనుభవించే కంటే వారి జీవితాన్ని అంతం చేయవచ్చని ఈ చట్టంలో ప్రభుత్వం పేర్కొంది. యురోపియన్‌ యూనియన్‌ దేశాలైన లక్సెంబర్గ్, బెల్జియం, స్విట్జర్లాండ్‌ దేశాల్లో ఇటువంటి కొన్ని చట్టాలు ఉన్నప్పటికీ దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.


ప్రత్యేక పరిస్థితుల్లో వైద్యుల సాయంతో వారికి మరణాన్ని ప్రసాదిస్తున్నారు. లక్సెంబర్గ్‌లో మాత్రం పెద్ద వయసు వారికి మాత్రమే అనుమతి ఇచ్చేలా చట్టాలు ఉన్నాయి. కానీ నెదర్‌లాండ్స్‌లో మాత్రం 12 ఏళ్లలోపు పిల్లలను చంపుకునే అవకాశం కల్పించడం విశేషం.

10TV Telugu News