Warm Vaccine : కరోనాపై మరో బ్రహ్మాస్త్రం..ఉష్ణ టీకా ట్రయల్స్‌లో మంచి ఫలితాలు

రకరకాల రూపాలతో కరోనా కోరలు చాస్తోన్న క్రమంలో మహమ్మారిపై బ్రహ్మాస్త్రం సిద్ధం అవుతోంది. అదే ‘ఉష్ణ టీకా’(Warm Vaccine) క్లినికల్ ట్రయల్స్‌లో ఉష్ణ టీకా మంచి ఫలితాలను ఇస్తోంది. ఇంతకీ ఏంటి దీని స్పెషాలిటీ. ఇది అందుబాటులోకి వస్తే.. కరోనాపై పోరులో గేమ్ చేంజర్‌గా మారడం ఖాయమా.. అసలు ఈ టీకా ఇండియాకు మరీ అవసరం అన్న అభిప్రాయాలు ఎందుకు వినిపిస్తున్నాయ్.

Warm Vaccine : కరోనాపై మరో బ్రహ్మాస్త్రం..ఉష్ణ టీకా ట్రయల్స్‌లో మంచి ఫలితాలు

Warm Vaccine

Warm Vaccine : రకరకాల రూపాలతో కరోనా కోరలు చాస్తోంది. మహమ్మారిపై బ్రహ్మాస్త్రం సిద్ధం అవుతోంది. అదే ‘ఉష్ణ టీకా’(Warm Vaccine) క్లినికల్ ట్రయల్స్‌లో ఉష్ణ టీకా మంచి ఫలితాలను ఇస్తోంది. ఇంతకీ ఏంటి దీని స్పెషాలిటీ. ఇది అందుబాటులోకి వస్తే.. కరోనాపై పోరులో గేమ్ చేంజర్‌గా మారడం ఖాయమా.. అసలు ఈ టీకా ఇండియాకు మరీ అవసరం అన్న అభిప్రాయాలు ఎందుకు వినిపిస్తున్నాయ్. మంచి ఫలితాలు
వేడి టీకా వస్తే ఇండియాకు ఎలాంటి లాభం?అసలు ఉష్ణ టీకా స్పెషాలిటీస్ ఏంటో తెలుసుకుందాం..

కరోనాకు ఫస్ట్ వేవ్‌తో పోల్చకుంటే..సెకండ్ వేవ్‌ అన్ని దేశాల్ని అతలాకుతలం చేసేస్తోంది. ఈ క్రమంలో థర్డ్ వేవ్ పొంచి ఉందనే హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయ్. ఇక భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా పుట్టుకొస్తున్న కొత్త వేరియంట్లు.. మరింత టెన్షన్ పుట్టిస్తున్నాయ్. ఆల్ఫా, బీటా, డెల్టా అంటూ మహమ్మారి రూపం ఛేంజ్ చేసుకుంటుండగా.. ఇప్పుడున్న వ్యాక్సిన్లు వాటిపై పనిచేస్తాయా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయ్. ఇటువంటి సమయంలో కన్ని కరోనా వేరియంట్లకు కళ్లెం వేసే ఓ అస్త్రం అందుబాటులోకి రాబోతోంది. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా తట్టుకునే టీకాపై… జరుగుతున్న పరిశోధనలు మంచి ఫలితాలు ఇచ్చాయ్. ఇప్పుడు ఉపయోగిస్తున్న వ్యాక్సిన్లు.. కోల్డ్‌ స్టోరేజీలో భద్రపరచాల్సి ఉంటుంది. ఐతే ఇకపై ఆ అవసరం లేని ఉష్ణ టీకాలను సాకారం చేసే దిశగా భారత్-ఆస్ట్రేలియా సంయుక్తంగా శాస్త్రవేత్తలు వినూత్న పరిశోధనల్లో ముందడుగు వేశారు. అన్ని రకాల వేరియెంట్లపైనా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ఎలుకలపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ ఫలితాల్లో తేలింది.

బెంగుళూరులోని ఐఐఎస్‌సీ, మైన్‌వ్యాక్స్ బయోటెక్ అనే సంస్థలు సంయుక్తంగా చేసిన పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్ సానుకూల ఫలితాలను ఇచ్చాయ్. దీని సామర్థ్యంపై ఆస్ట్రేలియాకు చెందిన CSIRO ఆధ్వర్యంలో పరీక్షలు జరిగాయ్. అన్ని రకాల వేరియెంట్లపై వీటిని టెస్ట్ చేశారు. ఈ టీకాలు ఎలుకల్లో బలమైన రోగనిరోధక స్పందనలను కలిగించినట్లు తేలింది. భారత్‌లోని సగటు 37 డిగ్రీల సెల్సియస్ దగ్గర కూడా ఈ టీకాలు నెలరోజుల పాటు చెక్కు చెదరకుండా ఉంచే వీలుంటుంది. 100 డిగ్రీల సెల్సియస్ దగ్గర 90నిమిషాల పాటు ఈ టీకాలు దెబ్బతినకుండా ఉన్నట్లు తేలింది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లను కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో స్టోర్ చేయాల్సి ఉంది. ఆస్ట్రాజనికా టీకాను 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ దగ్గర నిల్వ చేయాలి. ఫైజర్ వ్యాక్సిన్‌కు మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ మోతాదులో స్టోర్ చేయాలి. దీనికోసం ప్రత్యేక కోల్డ్ స్టోరేజ్ యంత్రాలనే వాడాల్సి వస్తోంది. ఐతే వేడి టీకా అందుబాటులోకి వస్తే ఇండియాలో అది గేమ్‌ చేంజర్‌గా మారడం ఖాయం. ఇండియాలో గ్రామాలు ఎక్కువ. పర్వత ప్రాంతాల్లోనూ ఊళ్లు ఉంటాయ్. అలాంటి చోట్ల కోల్డ్‌ స్టోరేజీ చైన్ మెయింటేన్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఐతే ఈ వేడి టీకా అందుబాటులోకి వస్తే.. వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగం పుంజుకునే అవకాశాలు ఉంటాయ్. ఇక దీనికితోడు.. అన్ని రకాల వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేస్తుందని తేలడం.. మరో సానుకూల అంశంగా మారడం ఖాయం అంటున్నారు నిపుణులు.