world largest water lily : ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆకు ఉన్న వాటర్ లిల్లీ మొక్క

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆకు ఉన్న వాటర్ లిల్లీ జాతి మొక్క. దీన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

 world largest water lily : ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆకు ఉన్న వాటర్ లిల్లీ మొక్క

Giant Water Lily At Rinconada Gardens, Bolivia (2)

world’s largest known giant water lily :  మానవ మనుగడకు అతి ముఖ్యమైనవి.. ఆహారం, దుస్తులు, నివాసం. వీటితోపాటు ప్రాణ వాయువు ఆక్సిజన్ కూడా ఎంతో అవసరం. ఈ అవసరాలన్నీ దాదాపు మొక్కల నుంచి ప్రత్యక్షంగాను..పరోక్షంగా తీరుతున్నాయి. అంతేకాకుండా ఇతరత్రా అనేక రూపాల్లో మొక్కలు మానవుని అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. ఉదాహరణ ఔషధాలు, కలప, అలంకరణ వస్తువులు, నూనె, వనస్పతి మొదలైనవి. మొక్కలు నేలమీదే కాదు..నీటిలో కూడా పెరుగుతాయి. ఉదాహరణకు కలువ, తామర వంటివి. కొన్ని మొక్కలకు ఆకులు చిన్న చిన్నవిగా ఉంటాయి. మరికొన్ని పెద్దవిగా ఉంటాయి.

Scientists discover new giant water lily species - BBC News

ప్రకతి వింత కాకపోతే..చిన్న చిన్న మొక్కలకు పెద్ద పెద్ద ఆకులు ఉంటే.. చింత చెట్టు లాంటి భారీ వృక్షాలకు అతి చిన్న ఆకులు ఉంటాయి. అలాగే పొడవుగా పెరిగే టేకు చెట్ల ఆకులు పెద్ద పెద్దగా ఉంటాయి. అలాగే అరటి చెట్టు ఆకులైతే మన చేయి చాచినా అందనంత పెద్దగా ఉంటాయి. అరటి ఆకులో భోజనం చేస్తే చాలా ఆరోగ్యం అని పెద్దలు చెబుతుంటారు.

Big bloom! Scientists discover world's largest water lily in London: What  we know about it

వీటి సంగతి పక్కన పెడితే..వాటర్ లిల్లీ నీటిలో పెరిగే ఈ మొక్క ఆకులు కూడా పెద్దగానే ఉంటాయి. ఇటీవల వాటర్ లిల్లీ ఆకుల్లో కూడా భోజనాలు చేస్తుంటారు. తామర మొక్కల తరహాలో నీటిలో పెరిగే వాటర్ లిల్లీ ఆకులు గుండ్రంగా చాలా పెద్ద పరిమాణంలో ఉంటాయి. అలాంటిది వాటర్ లిల్లీలో కూడా చాలా పెద్ద రకాన్ని బ్రిటిష్‌ రాయల్ బొటానికల్ గార్డెన్స్ శాస్త్రవేత్తలు తాజాగా దక్షిణ అమెరికా దేశం బొలీవియాలో గుర్తించారు.

What a huge lily pad can teach us about building design

నిజానికి 19వ శతాబ్దంలో యూరోపియన్‌ వృక్ష శాస్త్రవేత్తలు అతిపెద్ద ఆకులతో కూడిన వాటర్‌ లిల్లీ మొక్కలను గుర్తించారు. వాటికి అప్పటి బ్రిటిష్‌ రాణి పేరిట విక్టోరియా జాతికి చెందిన మొక్కలుగా పేరుపెట్టారు. వాటి ఒక్కో ఆకు పెద్ద సైజు టేబుల్ అంత ఉంటుంది. ప్రపంచంలో అలాంటివి కేవలం అమెజాన్ ప్రాంతంలో ఒకచోట, బ్రిటన్ లో మరోచోట మాత్రమే ఉన్నాయి. చిన్న పిల్లలు వాటిపై కూర్చున్నా కూడా అలాగే నీటిపై తేలుతూ ఉండగలిగేంత బలంగా వీటి ఆకులు ఉంటాయి.

The features of giant water lilies – How It Works

కానీ ఇన్నేళ్ల తర్వాత బొలీవియాలోని రిన్‌ కొనాడా గార్డెన్స్‌లో పెరుగుతున్న భారీ వాటర్ లిల్లీని గుర్తించారు. దాని ఆకులు ఏకంగా మూడున్నర మీటర్లకుపైగా వ్యాసంతో ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. అంటే ఒక చిన్న సైజు గది అంత పెద్దగా ఈ ఆకులు ఉన్నాయి.ప్రపంచంలో ఉన్న మిగతా రెండు వాటర్ లిల్లీ జాతులకు, దీనికి సంబంధం లేదని.. ఇది మొదటి నుంచీ వేరుగా పెరుగుతున్న మరో జాతి వాటర్ లిల్లీ అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.ఇటీవలే ఫ్రాంటియర్స్‌ ఇన్‌ ప్లాంట్‌ సైన్సెస్‌ జర్నల్ లో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి.