కమలా హారిస్‌పై మరోసారి వ్యక్తిగత కామెంట్స్ చేసిన ట్రంప్.. ఏమన్నారో తెలుసా?
‘‘నేను ఆమె కంటే బాగుంటాను’’ అని అన్నారు. అంతేగాక,

అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌పై ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే.
తాజాగా, పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘నేను ఆమె కంటే బాగుంటాను’’ అని అన్నారు. అంతేగాక, ఇటీవల టైమ్ మ్యాగజైన్ ముఖచిత్రంగా కమలా హారిస్ ఫొటోను ప్రచురించిన తీరుపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. కమలా హారిస్ చిత్రాన్ని వేయడానికి ఆ మ్యాగజైన్ ఓ స్కెచ్ ఆర్టిస్టును పనిలో పెట్టుకోవలసి వచ్చింది చెప్పారు.
ఆ మ్యాగజైన్ ఆ పని చేయకపోతే కమలా హారిస్ ఫొటోలు ముఖచిత్రంగా పనికిరావన్నట్లు ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. అంతేగాక, కమలా హారిస్‌ను ‘రాడికల్ లిబరల్’ అని విమర్శించారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా మళ్లీ బైడెన్ నిలబడతారని అందరూ భావిస్తే చివరకు కమలా హారిస్ పోటీ చేస్తున్నారు. దీనిపై ఇటీవల ట్రంప్ స్పందిస్తూ.. బైడెన్‌కి ఏమైందని ప్రశ్నించారు. తాను ఈ ఎన్నికల్లో మొదట బైడెన్‌పై పోటీకి నిలిచానని, ఇప్పుడేమో మరొకరిపై (కమలా హారిస్‌పై) పోటీ చేస్తున్నానని ఎద్దేవా చేశారు.
The reintroduction of Kamala Harris https://t.co/noW5TOgawP pic.twitter.com/iLmQIhxOeF
— TIME (@TIME) August 12, 2024
Also Read: షెరటన్ హోటల్‌లో సీఎల్పీ సమావేశం.. మంత్రి కోమటి రెడ్డి కీలక వ్యాఖ్యలు