హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఏ ప్రాతిపదికన హైడ్రాను ఏర్పాటు చేశారంటూ ప్రశ్న

ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేయడం అభినందిస్తున్నాం. కానీ, హైడ్రా ఏర్పాటు, హైడ్రా కమిషనర్ కు ఉన్న పరిధులు ఏమిటి అని..

హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఏ ప్రాతిపదికన హైడ్రాను ఏర్పాటు చేశారంటూ ప్రశ్న

Telangana High Court

Telangana High Court : ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేయడం అభినందిస్తున్నాం.. అయితే, ఏ ప్రాతిపదికన హైడ్రాను ఏర్పాటు చేశారు? దానికి కమిషనర్ కు ఉన్న పరిధులు ఏమిటి అని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. జన్వాడ ఫాంహౌస్ కూల్చొద్దంటూ ప్రదీప్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ విచారణ జరిపింది. పిటిషన్ తరపున న్యాయవాది తమ వాదనలు వినిపించారు. హైడ్రా పేరుతో హైడ్రామా క్రియేట్ చేస్తున్నారు. ఆగస్టు 14న కొంత మంది అధికారులు జాన్వాడ ఫామ్ హౌస్ కు వచ్చి కూల్చివేస్తామని బెదిరించారని కోర్టు దృష్టికి న్యాయవాది తీసుకెళ్లారు. వాదనల సందర్భంగా హైడ్రాకు ఉన్న పరిధులు గురించి చెప్పాలని ఏఏజీకి ఉన్నత న్యాయస్థానం సూచించింది. హైడ్రా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని ఏఏజీ పేర్కొన్నారు.

Also Read :  రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టం, వెంటాడతాం: కేటీఆర్ వార్నింగ్

ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేయడం అభినందిస్తున్నాం. కానీ, హైడ్రా ఏర్పాటు, హైడ్రా కమిషనర్ కు ఉన్న పరిధులు ఏమిటి అని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. నిర్మాణాలకు ఒక ప్రభుత్వ శాఖనే అనుమతులు ఇస్తుంది.. మరో శాఖ కూల్చివేస్తుంది. 20 సంవత్సరాల క్రితం కట్టుకున్న భవనాలను హైడ్రా కమిషనర్ ఇప్పుడు కూల్చివేయడమేంటని న్యాయస్థానం ప్రశ్నించింది. అయితే, చెరువుల పరిరక్షణ కోసమే హైడ్రా ఏర్పాటైందని ఏఏజీ తెలిపారు. ప్రదీప్ రెడ్డి వేసిన పిటిషన్ కు విచారణ అర్హత లేదని తెలిపారు. జన్వాడలో ఉన్న ఫాం హౌస్ జీవో 111లోకి వస్తుందని, జీవో 111 పరిధిలోని భూములు, ఫాంహౌజ్ లు నీటిపారుదల శాఖ చూస్తోందని వివరించారు. వీటిని కూల్చివేసే హక్కు హైడ్రాకు లేదని ఏఏజీ తెలిపారు. అయితే, హైడ్రా కూల్చివేతల గురించి చర్చించాల్సి ఉందని హైకోర్టు తెలిపింది.

Also Read : పావురం ఎగరలేదని ఎస్పీ సీరియస్.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ క‌లెక్ట‌ర్‌కు లేఖ

హైడ్రా లీగల్ స్టేటస్ ఏంటని ప్రశ్నించిన హైకోర్టు.. హైడ్రా విధివిధానాలు ఏమిటని ప్రశ్నించింది. ఏ ప్రాతిపదికన హైడ్రాను ఏర్పాటు చేశారు..? మధ్యాహ్నం పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది.