న్యూస్ పేపర్లు ముట్టుకుంటే..కరోనా వైరస్ రాదు!

  • Published By: madhu ,Published On : March 27, 2020 / 02:25 AM IST
న్యూస్ పేపర్లు ముట్టుకుంటే..కరోనా వైరస్ రాదు!

కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. కానీ ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుందనే దానిపై రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఫలానాది ముట్టుకున్నా..తాకినా..ఈ వైరస్ ఆటోమెటిక్ గా శరీరంలోకి ప్రవేశిస్తుందని విపరీతంగా ప్రచారం జరుగుతోంది. అందులో ప్రధానమైంది వార్త పత్రికలు. అవును..వీటిని ముట్టుకుంటే..వైరస్ వ్యాపిస్తుందని ప్రచారం జరుగుతోంది. దీనిని ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా అసోసియేషన్ (INMA) కొట్టిపారేసింది.

ఈ మేరకు అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,  సీఈవో ఎర్ల్ జే విల్కిన్ సన్ స్పందించారు. వార్తా పత్రిక, మ్యాగజైన్, ప్రింట్ చేసిన లేఖ, ప్యాకేజీల ద్వారా..కరోనా వ్యాపిస్తుందనే ఎలాంటి ఆధారం లేదని స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు..పలు అంతర్జాతీయ పరిశోధాన సంస్థలు దీనిపై అధ్యయనం చేయడం జరిగిందని, ఈ పరిశోధనల ద్వారా..వార్తా పత్రికల ద్వారా కరోనా వ్యాప్తి చెందదని ఇప్పటికే స్పష్టం చేశాయన్నారు.

కరోనా వ్యాపిస్తున్న దేశాల్లో వార్తా పత్రికలు, మ్యాగజైన్లతో కూడిన ప్యాకేజీలు తీసుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తి చెందడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోందన్నారు. వీటిని తీసుకొని చదవడం వల్ల వైరస్ శరీరంలోకి ప్రవేశించదని, ఎలాంటి ముప్పు ఉండదన్నారు. ఒకవేళ..కరోనా వైరస్ సోకిన వ్యక్తి పేపర్ ముట్టుకుంటే..? అతడి నుంచి వైరస్ కాగితంపైకి సోక ఛాన్స్ లేదని స్పష్టం చేశారాయన. అంతేగాకుండా…వార్తా పత్రికల రవాణా ద్వారా కూడా ఏ సమస్య ఉండదని చెప్పారు. 

ఇదే విషయాన్ని BBC చెబుతోంది. 
వార్తా పత్రికలు చాలా శుభ్రమైనవని చెబుతోంది బీబీసీ. రెడియో జాన్ ఇన్నెస్ సెంటర్ లోని వైరాలిజిస్ట్ జార్జ్ లొమోనోస్సాఫ్ తో ఒక ఇంటర్వ్యూ ప్రసారం చేసింది. ప్రింటింగ్ కోసం వాడే సిరా, ప్రింటింగ్ జరిగే పద్ధతి తదితర కారణాల వల్ల వార్తా పత్రికల పైభాగంలో వైరస్ ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయాని వెల్లడించింది. వివిధ ఉపరితలాలపై కరోనా వైరస్ ఎంత సేపు ఉంటుందనే దానిపై ఇటీవలే ఒక స్టడీ జరిగిందని, వార్తా పత్రికలపై వైరస్ ఉండే..అవకాశమే..లేదని స్పష్టమైందని INMA సీఈవో ఎర్ల్ జే విల్కిన్ సన్ వెల్లడించారు. సో…వార్తా పత్రికలు ముట్టకుంటే..కరోనా వైరస్ రాదన్నమాట.