North Korea: కొవిడ్‌పై గెలిచామని ప్రకటించిన కిమ్ జంగ్ ఉన్

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ కొవిడ్-19పై విజయం సాధించామంటూ బుధవారం ప్రకటన విడుదల చేశారు. రెండు వారాలుగా ఎటువంటి కొత్త కేసులు నమోదు కావడం లేదని అధికారులు తెలిపినట్లు పేర్కొన్నారు. హెల్త్ వర్కర్లు, సైంటిస్టులతో మీటింగ్ లో పాల్గొన్న కిమ్.. మహమ్మారిపై యుద్ధంలో విజయం సాధించామని తెలిపారని గవర్నమెంట్ న్యూస్ ఏజెన్సీలో వెల్లడైంది.

North Korea: కొవిడ్‌పై గెలిచామని ప్రకటించిన కిమ్ జంగ్ ఉన్

Kim Jong Un

 

 

North Korea: నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ కొవిడ్-19పై విజయం సాధించామంటూ బుధవారం ప్రకటన విడుదల చేశారు. రెండు వారాలుగా ఎటువంటి కొత్త కేసులు నమోదు కావడం లేదని అధికారులు తెలిపినట్లు పేర్కొన్నారు. హెల్త్ వర్కర్లు, సైంటిస్టులతో మీటింగ్ లో పాల్గొన్న కిమ్.. మహమ్మారిపై యుద్ధంలో విజయం సాధించామని తెలిపారని గవర్నమెంట్ న్యూస్ ఏజెన్సీలో వెల్లడైంది.

మహమ్మారి ఆరంభమైనప్పటి దేశం అప్రమత్తమైంది. క్యాపిటల్ ప్యాంగ్యాంగ్ లో ఒమిక్రాన్ ఉందని… మ్యాగ్జిమం ఎమర్జెన్సీ ఎపిడెమిక్ ప్రివెన్షన్ సిస్టమ్ ను యాక్టివేట్ చేసింది. నార్త్ కొరియాలో కొందరు కొవిడ్ పేషెంట్లను ఫీవర్ పేషెంట్లుగానే డీల్ చేస్తున్నారు. టెస్టింగ్ కెపాసిటీ కొరత కారణంగానే ఇలా జరుగుతుందని సమాచారం.

జులై 29 నుంచి ప్యాంగ్యాంగ్ లో వైరస్ సంబంధించి కొత్త కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు.

Read Also : నార్త్ కొరియాలో ఆకలి కేకలు!

కేసీ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. మన ప్రజలు సాధించిన చారిత్రక విజయం ప్రపంచంలోనే నార్త్ కొరియా ఎంత గొప్పదో తెలియజేసిందని కిమ్ అన్నారు. అందమైన దేశ సంప్రదాయాలు అనుసరిస్తున్నందుకు గర్వించాలని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న వారంతా సంతోషంలో మునిగిపోయారు. అంకిత భావంతో పనిచేసి విజయానికి కారణమైన వారికి అశ్రునయనాలతో కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

ఇంతటి గొప్ప విజయంతో ఎగ్జైటింగ్ కు గురైన కిమ్.. అక్కడికి వచ్చిన వారితో సీనియర్ అఫీషియల్స్ తో ఫొటో సెషన్ లో పాల్గొన్నారు.

అధికారిక లెక్కల ప్రకారం.. గత ఏప్రిల్ నుంచి నార్త్ కొరియాలో 4.8 మిలియన్ మందికి ఇన్ఫెక్షన్ సోకింది. 74మంది మృత్యువాతకు గురయ్యారని కేసీఎన్ఏ తెలిపింది.