Kim Jong Un : నార్త్ కొరియాలో ఆకలి కేకలు!

ఉత్తర కొరియాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం, ఆహార కొరతపై ఆ దేశ అధ్యక్షుడు కిమ్​ జోంగ్ ఉన్​ ఆందోళన వ్యక్తం చేశారు.

Kim Jong Un : నార్త్ కొరియాలో ఆకలి కేకలు!

Kim

Kim Jong Un ఉత్తర కొరియాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం, ఆహార కొరతపై ఆ దేశ అధ్యక్షుడు కిమ్​ జోంగ్ ఉన్​ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో సరిహద్దులు మూసివేయడం మరియు గతేడాది సంభవించిన తుఫాన్ ల కారణంగా పంట నష్టం జరగిన నేపథ్యంలో దేశంలో ఆహార ఏర్పడే అవకాశం ఉందని కిమ్ హెచ్చరించారు. దేశ ఆర్థిక పరిస్థితులపై సమీక్ష జరిపేందుకు కిమ్ జోంగ్ ఉన్ ఆధ్వర్యంలో మంగళవారం అధికార వర్కర్స్ పార్టీ కేంద్ర కమిటీ ప్లీనరీ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడుతూ..గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తర కొరియా ఆదాయం కొంత మేర పెరిగిందన్నారు. గతేడాది పోలిస్తే ఈ ఏడాది దేశ పారిశ్రామిక ఉత్పత్తి 25 శాతం పెరిగిందని తెలిపారు. అయితే ఇదే సమయంలో తుపాను, వరదల కారణంగా పంటలు ధ్వంసమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో దేశంలో ఆహార ఉత్పత్తి తగ్గిపోయి..దేశం ఆకలితో అలమటించే పరిస్థితి నెలకొందని కిమ్ తెలిపారు. ప్రజలు ఇప్పటికే ఆహార కొరతను, ఇతర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. పరిస్థితులు దిగజారకముందే వ్యవసాయ ఉత్పత్తులను పెంచే మార్గాలను అన్వేషించాలని అధికారులకు కిమ్ సూచించారు. తన ఇదివరకటి ఐదేళ్ల ఎకనామిక్ ప్లాన్ ప్రతి రంగంలోనూ విఫలమైందని కిమ్ అంగీకరించారు. ప్రజలకు ఆహారం, గృహ వసతి, బట్టలు మొదలైన సౌకర్యాల కల్పన కోసం తమ పార్టీ ప్రయత్నాలను ముమ్మరం చేస్తుందని ఆయన తెలిపారు. ఇక,కోవిడ్​-19 ఆంక్షలు మరోసారి పొడిగించిన దృష్ట్యా.. రాబోయే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజలు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. ఉత్తర కొరియాలో 1990లో తీవ్రమైన కరువు కారణంగా వేలాది మంది ప్రజలు చనిపోయారు. ప్రస్తుత ఆహార సంక్షోభం నేపథ్యంలో మళ్లీ ఆనాటి పరిస్థితులు పునరావృతమవుతాయా అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు,కిమ్ జోంగ్ ఉన్ సన్నబడ్డ ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

మిసైల్, న్యూక్లియర్ పరీక్షలను నిరంతరంగా సాగిస్తుందన్నవల్ల ఈ దేశంపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. ఫలితంగా ఆయా దేశాల నుంచి అందాల్సిన సాయం కూడా నిలిచిపోయింది. 2018లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, కిమ్ మధ్య జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో అమెరికా ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. మరోవైపు చైనాతో సరిహద్దు వివాదంతో కొరియా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటొంది. కోవిడ్ నేపథ్యంలో పొరుగు దేశాలతో సరిహద్దులు కూడా మూతపడటంతో ఆహార వాణిజ్యం కూడా నిలిచిపోయింది.