Omicron: భయపెడుతున్న ఒమిక్రాన్‌.. సరిహద్దులు మూసివేత!

ఒమిక్రాన్‌ వ్యాపించిన దేశాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఇప్పటివరకు 15దేశాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

Omicron: భయపెడుతున్న ఒమిక్రాన్‌.. సరిహద్దులు మూసివేత!

Omicran

Omicron: ఒమిక్రాన్‌ వ్యాపించిన దేశాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఇప్పటివరకు 15దేశాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. లేటెస్ట్‌గా ఈ లిస్ట్‌లో స్పెయిన్‌ చేరింది. దక్షిణాఫ్రికా నుంచి మాడ్రిడ్‌ చేరుకున్న ఓ వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా ఒమిక్రాన్‌ బయటపడింది. దీంతో అతడిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఇప్పటివరకు ఒమిక్రాన్‌ కేసులు నమోదైన జాబితాలో దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, బెల్జియం, హాంకాంగ్,జర్మనీ, చెక్ రిపబ్లిక్, ఇజ్రాయెల్, ఇటలీ, బ్రిటన్ , ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌ ఉన్నాయి. మరోవైపు ఒమిక్రాన్‌ భయంతో సరిహద్దులు మూసేస్తున్న దేశాల సంఖ్య కూడా పెరిగిపోతోంది.

లేటెస్ట్‌గా జపాన్‌ కూడా ఆంక్షల బాట పట్టింది. విదేశీ సంద‌ర్శకుల రాక‌పై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు జ‌పాన్ ప్రభుత్వం ప్రకటించింది. నేటి నుంచి ఈ నిర్ణయం అమ‌ల్లోకి రానుందని ప్రధాని ఫుమియో కిషిద వెల్లడించారు.

Angry With Son: కొడుకు మీద కోపంతో రూ.2.5కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి..

గతవారమే ద‌క్షిణాఫ్రికా స‌హా ఎనిమిది ఇత‌ర దేశాల నుంచి వ‌చ్చేవారికి ప్రభుత్వ కేంద్రాల్లో ప‌ది రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల‌ని అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. లేటెస్ట్‌గా విదేశీ పర్యాటకులపై పూర్తి నిషేధం విధించింది.

ఈ నెల ప్రారంభంలో విదేశీ విద్యార్ధులు, కార్మికులు, స్వల్పకాలిక వాణిజ్య సంద‌ర్శకుల కోసం సరిహ‌ద్దు నియంత్రణ‌ల‌ను స‌డ‌లించిన జ‌పాన్ మళ్లీ వాటిని పున‌రుద్ధరించింది.