First woman Afghan mayor: అఫ్ఘాన్‌లో ప్రస్తుత పరిస్థితులకు పాకిస్తాన్‌ కూడా కారణమే!

అఫ్ఘానిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితికి పాకిస్తాన్ కూడా కారణమే అని ఆరోపించారు ఆ దేశంలో మొదటి మహిళా మేయర్ జరీఫా గఫ్రి.

First woman Afghan mayor: అఫ్ఘాన్‌లో ప్రస్తుత పరిస్థితులకు పాకిస్తాన్‌ కూడా కారణమే!

Zafri

Pakisthan: అఫ్ఘానిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితికి పాకిస్తాన్ కూడా కారణమే అని ఆరోపించారు ఆ దేశంలో మొదటి మహిళా మేయర్ జరీఫా గఫ్రి. తాలిబాన్ ఆక్రమణకు పాల్పడినట్లు పాకిస్తాన్ ఆరోపించింది. దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్‌కు స్పష్టమైన పాత్ర ఉందని, ఆఫ్ఘనిస్తాన్‌లోని చిన్నపిల్లలతో సహా ప్రతీ ఒక్కరికీ ఈ విషయం తెలుసునని జరీఫా గఫ్రీ మంగళవారం అన్నారు. పాకిస్థాన్ తాలిబాన్లకు బహిరంగంగా సపోర్ట్ చేస్తుందని ఆమె ఆరోపించారు.

జరీఫా గఫ్రి దేశంలోని అతి చిన్న వయస్సులో మేయర్ అయ్యారు. 26ఏళ్ల వయస్సులో, ఆమె మైదాన్ నగరానికి మేయర్ అయ్యారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల ఆక్రమణ తరువాత, గఫ్రి దేశం విడిచి జర్మనీకి వెళ్లారు. చాలామంది మాజీ ప్రభుత్వ అధికారులు మరియు అఫ్ఘాన్ నిపుణులు కూడా తాలిబాన్లు దేశాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత అందుకు కారణం పాకిస్తాన్‌ అంటూ నిందిస్తున్నారు.

మాజీ మేయర్ తన దేశంలో పరిస్థితికి అంతర్జాతీయ సమాజంతో సహా ప్రతి ఒక్కరినీ నిందించాడు. ఈ రోజు అఫ్ఘానిస్తాన్ ఎదుర్కొంటున్న దానికి స్థానిక ప్రజలు, రాజకీయ నాయకులు, అంతర్జాతీయ సమాజంతో సహా ప్రతి ఒక్కరినీ నిందించాల్సిందేనని అన్నారు. స్థానిక ప్రజలు తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఏకంగా తమ స్వరాన్ని వినిపించలేదని, అందువల్లే తీవ్రవాదం పెరిగిపోయిందని అన్నారు.

అఫ్ఘానిస్తాన్‌లో తనను వెతుక్కుంటూ తాలిబాన్ ఉగ్రవాదులు తన ఇంటికి వచ్చారని, వారు తన హోంగార్డును దారుణంగా కొట్టారని గఫ్రీ చెప్పారు. గడిచిన 20 ఏళ్లలో నేను సాధించిన విజయాలన్నింటినీ తాలిబాన్ల కారణంగా కోల్పోయాను. కాబట్టి నేను ఎవరినీ క్షమించలేనని అన్నారు. ఈ రోజు నాకు ఏమీ మిగలలేదు. ఈ రోజు నా భూమికి సంబంధించిన మట్టి మాత్రమే నాతో ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని తాలిబన్లు ఒక్కొక్కరుగా చంపుతున్నారని, అఫ్ఘాన్ నుంచి తాలిబాన్లు ప్రతిఘటనను ఎదుర్కొంటారా? అని ప్రశ్నించగా, గఫ్రీ, “ఖచ్చితంగా” అని సమాధానం ఇచ్చారు. వారు (తాలిబాన్లు) నాలాంటి వారిని ఎందుకు చంపుతున్నారో మీకు తెలుసా? ఎందుకంటే వారు ప్రజలు తరపున నిలబడి ప్రశ్నిస్తే ఒప్పుకోరు కాబట్టి అన్నారు.

తాలిబాన్లు దేశాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ప్రజలలో భయం మరియు ఆందోళన వాతావరణం కనిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో చాలా మంది ఉగ్రవాదుల నుంచి తప్పించుకోవడానికి దేశం విడిచి పారిపోతున్నారు. ఇప్పటికే ఎందరో అధికారులు, నాయకులు దేశం విడిచి పారిపోయారు.