ఘోరాతి ఘోరం : 15 ఏళ్ల బాలుడు ఫ్రెండ్స్ తో కలిసి పిల్లి పిల్లపై గ్యాంగ్‌రేప్..‌

  • Published By: nagamani ,Published On : July 30, 2020 / 03:51 PM IST
ఘోరాతి ఘోరం : 15 ఏళ్ల బాలుడు ఫ్రెండ్స్ తో  కలిసి పిల్లి పిల్లపై గ్యాంగ్‌రేప్..‌

పశువుల్లో కూడా లేని అత్యాచారం వికృతం మనుషుల్లోనే ఉంది. కానీ కామాంధులకు మనుషులు జంతువులు అనే తేడా కూడా లేని రాక్షసత్వంతో ఆడవాళ్లమీదనే కాదు జంతువుల మీద కూడా అత్యాచారాలకు తెగబడుతున్నారు. ఆవుల మీద ఇటువంటి దారుణం జరిగిన వార్తలు విన్నాం. కానీ అమాయకపు పిల్లి పిల్ల మీద గ్యాంగ్ రేప్ కు తెగబడిన దారుణ ఘటన పాకిస్థాన్ లో చోటుచేసుకుంది. ఈ ఘాతుకానికి పాల్పడింది కేవలం 15 ఏళ్ల బాలుడు అని స్నేహితులు. ఇటువంటివారిని ఏమనాలో కూడా అర్థం కాని దుస్థితి.దుర్మార్గం.మగజాతి దురహంకారానికి పరాకాష్టగా అత్యంత దారుణంగా ఓ పిల్లికూనపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు 15ఏళ్ల బాలుడు అతని ఫ్రెండ్స్. పాకిస్తాన్‌లోని లాహోర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసింది.

15 ఏళ్ల బాలుడు తన ఫ్రెండ్స్ తో కలిసి వారంరోజులపాటు ఆ పిల్లి పిల్లపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ దారుణాన్ని పాపం ఆ పిల్లికూన లేత శరీరం తట్టుకోలేకపోయింది. తీవ్ర రక్తస్రావమై నరకయాతన అనుభవించి చివరికి ప్రాణాలు వదిలింది. ఈ ఘటనపై పాకిస్తాన్‌లోని జంతు హక్కుల సంఘం జేకే యానిమల్ రెస్క్యూ అండ్ షెల్టర్ (JFK Animal Rescue And Shelter) ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పిల్లిపై అత్యాచారానికి తెగబడిన బాలుడి కుటుంబం ఆ పిల్లి పిల్లను కొనుక్కుని పెంచుకుంటున్నారు. ఆ పిల్లిపై పడిన ఆ బాలుడు కన్ను దానిపై అత్యాచారానికి తెగబడేలా చేసింది.

ఓ ఇంట్లో తీవ్ర రక్తస్రావంతో సోలిపోతూ ఉన్న పిల్లిని స్థానికంగా ఓ ఉండే యువతి చూసింది. అనుమానం వచ్చింది. ఆ ఇంట్లో ఉండే బాలుడిని పిలిచి అడిగింది. దానికి వాడు తలతిక్కగా సమాధానం చెప్పాడు. దాంతో ఆమెకు మరింత అనుమానం వచ్చి..తీవ్ర గాయాలతో తల్లడిల్లుతున్న పిల్లిపిల్లను వారి నుంచి బలవంతంగా తీసేసుకుంది.తరువాత దాన్ని వెటర్నరీ ఆసుపత్రికి పరుగెత్తింది. పిల్లికూన పరిస్థితిని చూసి డాక్టర్లు కూడా షాక్ అయ్యారు. ఆ పిల్లిపిల్ల శరీరంపై పలు చోట్ల గాయాలతో పాటు దాని జననాంగం నుంచి వీర్యం, రక్తం కారడం చూసి డాక్టర్లు కూడా చలించిపోయారు.

చావు బతుకులతో పోరాడుతున్న ఆ పిల్లికూనను బతికించేందుకు వారు ఎంతో శ్రమించారు. కానీ అప్పటికే దాని పరిస్థితి అత్యంత విషమంగా మారటంతో చనిపోయింది. ఈ విషయం అలా అలా జంతు హక్కుల సంఘాల కార్యకర్తలకు తెలిసింది. ఆ పిల్లికూనను అటువంటి పరిస్థితిలో చూసినవారంత కన్నీరు పెట్టుకున్నాడు. ఆ పిల్లి మృతదేహానికి జంతు హక్కుల సంఘాల కార్యకర్తలు అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం ఈ ఘటనపై జంతు హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడవారే కాదు ఇటువంటి కామాంధులకు మూగజీవాలు కూడా బలైపోతున్నాయని వాపోయారు.