Pakistan Airlines : కాబూల్‌కు విమాన సర్వీసులు నిలిపేసిన పాక్

తాలిబన్ల మితిమీరిన జోక్యం కారణంగా అఫ్గాన్‌ రాజధాని కాబుల్‌కు తమ విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్-PIA ప్రకటించింది.

Pakistan Airlines : కాబూల్‌కు విమాన సర్వీసులు నిలిపేసిన పాక్

Taliban Pak

Afghanistan Flights : తాలిబన్ల మితిమీరిన జోక్యం కారణంగా అఫ్గాన్‌ రాజధాని కాబూల్‌కు తమ విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్-PIA ప్రకటించింది. టికెట్ల ధరలను తగ్గించాలని, లేకపోతే సేవలను నిలిపివేస్తామని తాలిబన్లు ఇటీవల PIAతోపాటు స్థానిక విమానయాన సంస్థ ‘కామ్ ఎయిర్‌’ను హెచ్చరించారు. దీంతో పాక్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం PIAలో కాబూల్ నుంచి ఇస్లామాబాద్‌కు టికెట్‌ ధర 2 వేల 500 డాలర్ల వరకు ఉంటోంది.

Read More : TB deaths : టీబీ మరణాలు పెరుగుతున్నాయి..జాగ్రత్త

అంతకుముందు కేవలం 120- 150 డాలర్ల మధ్యే ఉండేది. అఫ్ఘానిస్థాన్‌ తాలిబన్ల వశమైన తర్వాత ఇక్కడి నుంచి రెగ్యులర్‌గా సర్వీసులు నడుపుతున్న ఏకైక అంతర్జాతీయ విమాన సంస్థ ఇదే. ప్రస్తుతం PIA.. కాబుల్‌కు ఛార్టర్డ్‌ విమానాలు నడుపుతోంది. మానవతా దృక్పథంతోనే అఫ్ఘాన్‌కు విమానాలు నడుపుతున్నామని… అయితే ప్రీమియం ధరలు భారీగా ఉండడంతో వాటి ప్రభావం టికెట్లపై పడుతోందని PIA వివరించింది.

Read More : Global Hunger : ఆకలి మంటలు..భారత్ 101, అప్ఘాన్ 103 ప్లేస్

మరోవైపు, తాలిబన్లు చివరి నిమిషంలో ప్రయాణ నిబంధనలు మార్చడం, అనుమతులకు అర్థంలేని రూల్స్‌ పెట్టడం, సిబ్బందిని భయపెట్టే విధంగా ప్రవర్తించడం చేస్తున్నారని ఆరోపించింది. ఇక భూ మార్గాల్లో దేశం దాటేందుకు ఇబ్బందుల కారణంగా అప్ఘాన్‌లో విమాన ప్రయాణానికి భారీ డిమాండ్ ఏర్పడింది. కాబూల్‌లోని ప్రధాన పాస్‌పోర్ట్ కార్యాలయానికి స్థానికులు పోటెత్తుతున్నారు.