TB deaths : టీబీ మరణాలు పెరుగుతున్నాయి..జాగ్రత్త

దశాబ్ది కాలం తర్వాత తొలిసారిగా టీబీ మరణాలు పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. టీబీ నిర్ధారణ కూడా గణనీయంగా తగ్గినట్లు తాజా నివేదిక వెల్లడించింది. 

TB deaths : టీబీ మరణాలు పెరుగుతున్నాయి..జాగ్రత్త

Tb

Global TB deaths rise : దశాబ్ది కాలం తర్వాత తొలిసారిగా టీబీ మరణాలు పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా కొవిడ్‌ కారణంగా టీబీ నిర్ధారణ, చికిత్సలో ఆటంకం కలగడంతో  మరణాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు WHO ఆందోళన వ్యక్తం చేసింది. టీబీ నివారణ, చికిత్సపై శ్రద్ధ చూపాలని ప్రపంచ దేశాలకు WHO పిలుపునిచ్చింది. కొవిడ్‌ విజృంభణ కారణంగా టీబీ నిర్ధారణ కూడా గణనీయంగా తగ్గినట్లు తాజా నివేదిక వెల్లడించింది.

Read More :Food Crises in Pakistan: ‘ప్రజలు ఒక్కపూటే తినండీ తక్కువ తినండీ’ : పాక్ మంత్రిగారి వ్యాఖ్యలు 

2019లో 71లక్షల టీబీ కేసులు నిర్ధారణవగా.. ఆ సంఖ్య 2020 నాటికి 58 లక్షలకు పడిపోయింది. దీంతో నిర్ధారణ కాని టీబీ రోగుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అంచనా. అంతేకాకుండా వ్యాధి నిరోధక చికిత్స తీసుకుంటున్న వారి శాతం కూడా భారీగా తగ్గినట్లు వెల్లడైంది. ప్రస్తుతం 28లక్షల మంది మాత్రమే ఈ చికిత్స పొందుతున్నారని.. అంతకుముందుతో పోలిస్తే 28శాతం తగ్గినట్లు WHO నివేదిక వెల్లడించింది.

Read More : Women Food : మహిళలు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన ఆహారం ఇదే!..

ప్రమాదకరమైన టీబీ పోరులో భాగంగా 2030 నాటికి 90శాతం మరణాలు, 80శాతం కేసులను తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2015లో లక్ష్యాన్ని నిర్దేశించింది. అప్పటినుంచి 2020 నాటికి టీబీ మరణాల్లో దాదాపు 9శాతం, కేసుల్లో 11శాతం తగ్గుదల కనిపించింది. కానీ, ఊహించని రీతిలో విరుచుకుపడిన కొవిడ్‌ కారణంగా టీబీ నిర్మూలన ప్రణాళికకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.