Women Food : మహిళలు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన ఆహారం ఇదే!..

స్త్రీలకు మేలు చేసే ఆహారాలలో పాలు చాలా ముఖ్యమైనవి. ఎముకలు బలంగా ఉంచేలా చేస్తాయి. నెలసరి ఆగిపోయిన మహిళల్లో ఎముకలు బలహీనంగా మారతాయి. అలాంటి వారికి పాలు తాగటం అవసరం. పెరుగు తీసుకోవటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

Women Food : మహిళలు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన ఆహారం ఇదే!..

Www.behindthelens.com.au

Women Food : ఇల్లు చక్కదిద్దే బరువు బాధ్యతల్లో మునిగిపోయి మహిళలు తాము తీసుకుంటున్న ఆహారంపై ఏమాత్రం శ్రద్ధ వహించటంలేదు. తమ వారి శ్రేయస్సును నిరంతరం కోరుకుంటూ తాను మాత్రం సరైనా ఆహారం తీసుకోకుండా ఆరోగ్యపరమైన చిక్కులు కొనితెచ్చుకుంటుంది. వేళకు తినకుండా కొందరు, అందంగా కనిపించాలని డైటింగ్ చేస్తూ మరికొందరు, ఏమి తినాలో తెలియని స్ధితి ఇంకొందరు ఇలా మహిళలు పౌష్టికాహారానికి దూరమౌతున్నారు.

మగవారితో పోలిస్తే మహిళలకు ప్రత్యేకమైన ఆహారం అవసరం. వారి శరీర పనితీరు సక్రమంగా సాగాలంటే పోషకాహారం తప్పకుండా తీసుకోవాలి. రోజంతా పనిచేస్తూ శారీరకంగా, మానసికంగా వత్తిడికి లోనయ్యే మహిళలకు మంచి ఆహారం తీసుకోవటం చాలా అవసరం. గర్భదారణ, పిల్లలను కనటం, వారిని పెంచటం, అందరి ఆలనాపాలన చూడటం వంటి వాటితో మహిళ ఆరోగ్యంపై తీవ్రప్రభావం పడుతుంది. ఈనేపధ్యంలో మహిళలు మంచి ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళ ఆరోగ్యానికి మేలు కలిగించే ముఖ్యమైన ఆహారపదార్ధాల గురించి తెలుసుకుందాం..

పాలకూర…మహిళలు తీసుకోవాల్సిన అతిముఖ్యమైన ఆహారంలో పాలకూర ఒకటి. ఎముకల పటుత్వానికి, అస్తమా వంటి వ్యాధులను రాకుండా రక్షణగా ఉంటుంది. దీనిలో ఉండే మెగ్నీషియమ్ ప్రీ మెన్ స్ట్రుల్ సిండ్రోమ్ లక్షణాలను రాకుండా అడ్డుకుంటుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచటంలో దీనిని మించింది లేదని చెప్పవచ్చు. పాలకూర తోటపాటు ఇతర ఆకు కూరలను కూడా తీసుకోవటం వల్ల మంచి పోషకాలు లభిస్తాయి.

ఓట్స్…గుండెకు మేలు చేసే వాటిలో ఒట్స్ ఒకటి. ఓట్స్ ను క్రమం తప్పకుండా ఆహారంలో బాగం చేసుకుంటే గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు. దీనితోపాటు ప్రీమెన్‌స్ట్రుల్‌ సిండ్రోమ్‌ వల్ల కలిగే భావోద్వేగాలను ఓట్స్ నియంత్రిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరచటంలో దోహదం చేస్తాయి. బరువు పెరగటం, లావెక్కుతారన్న భయం ఉండదు.

వంటిట్లో నిత్యం తోడుగా ఉండే టోమాటోని చాలా మంది మహిళలు తినటానికి ఇష్టపడరు. అయితే దీనివల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుతుందని గ్రహించాలి. ఎముకల ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని లైకోపీన్‌ అనే పిగ్మెంట్‌ బ్రెస్ట్‌ క్యాన్సర్‌, గుండె జబ్బులు రాకుండా సమర్థవంతంగా అడ్డుకుంటుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

ఎర్రటి చిన్న పండ్లు క్రాన్‌బెర్రీస్‌ మహిళలు ఆహారంగా తీసుకుంటే చాలా మంచిది. వీటిని తినటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. మహిళల్లో తరచూ వచ్చే యూరినరీ ట్రాక్‌ ఇన్ఫెక్షన్‌ను ఇవి అరికట్టడంలో తోడ్పడతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉండటంతో జలుబు,దగ్గు, జ్వరం వంటి సమస్యలు దరిచేరవు.

అవిసెగింజలు మహిళలు తప్పని సరిగా తీసుకోవాల్సిన ఆహారం. గుండెకు చాలా మంచిది. ఇందులో ఒమెగా 3 ఫాటీ ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. వాపును, నొప్పిని తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా అవిసెగింజలు కలిగి ఉంటాయి. మలబద్ధకం సమస్యను దూరం చేస్తాయి.

స్త్రీలకు మేలు చేసే ఆహారాలలో పాలు చాలా ముఖ్యమైనవి. ఎముకలు బలంగా ఉంచేలా చేస్తాయి. నెలసరి ఆగిపోయిన మహిళల్లో ఎముకలు బలహీనంగా మారతాయి. అలాంటి వారికి పాలు తాగటం అవసరం. పెరుగు తీసుకోవటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. చేపలు,గుడ్లు, బాదం వంటి వాటినితీసుకోవాలి. సోయాబిన్ కూడా మంచి ఆహారం, మొలకులు, చిక్కుళ్ళు వంటి ఆహారం తీసుకోవాలి. దీని వల్ల జీర్ణ ప్రక్రియ బాగా ఉంటుంది. స్త్రీలు తమ ఆరోగ్యం కోసం మంచి ఆహారం తీసుకుంటే వారి జీవితకాలం పెరిగే అకాశం ఉంటుంది. పోషకాలతో కూడిన ఆహారంతో పాటు తగినంత నీటిని తీసుకోవటం కూడా అవసరం దీనివల్ల శరీరంలోని అన్ని అవయవాల పనితీరు బాగా ఉంటుంది.