Pak: విదేశీ పర్యటనలో ఉన్న ఆర్థిక మంత్రి.. రాజీనామా చేస్తున్నట్లు అక్కడి నుంచే ప్రకటన

పాకిస్తాన్‭లో ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణ స్థితిలో ఉంది. ఒక రకంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం పాక్ రాజధాని ఇస్లామాబాద్‭లో జరిగిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని హెహబాజ్ మాట్లాడుతూ పొరుగు దేశాలను తమను బిచ్చగాళ్లలా చూస్తున్నాయని, తమ నుంచి ఫోన్ వెళ్తే డబ్బులు అడుగతారేమోనని భయపడే పరిస్థితులు కొనసాగుతున్నాయని అన్నారు. ప్రధానే ఈ స్థాయిలో చెప్పారంటే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఏ స్థాయిలో ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు.

Pak: విదేశీ పర్యటనలో ఉన్న ఆర్థిక మంత్రి.. రాజీనామా చేస్తున్నట్లు అక్కడి నుంచే ప్రకటన

Pakistan Finance Minister Verbally Resigned

Pak: ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న పాకిస్తాన్ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్.. అక్కడి నుంచే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్‭లతో మాట్లాడిన అనంతరం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, ప్రస్తుతానికైతే మౌఖికంగా రాజీనామా చేస్తున్నట్లు.. పాకిస్తాన్ చేరుకోగానే అధికారికంగా తన రాజీనామా లేఖను ప్రభుత్వానికి సమర్పిస్తానని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని సోమవారం తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

‘‘మియాన్ (గౌరవంగా వాడే పదం) నవాజ్ షరీఫ్, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‭లతో ఈరోజు సమావేశమయ్యాను. అనంతరం నేను మౌఖికంగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. నా రాజీనామాను ప్రకటిస్తున్నాను. పాకిస్తాన్ చేరుకోగానే నా రాజీనామా లేఖను అధికారికంగా సమర్పిస్తాను. దేశానికి రెండుసార్లు ఆర్థిక మంత్రిగా పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను’’ అని మిఫ్తా ట్వీట్ చేశారు.

కాగా, పాకిస్తాన్‭లో ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణ స్థితిలో ఉంది. ఒక రకంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం పాక్ రాజధాని ఇస్లామాబాద్‭లో జరిగిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని హెహబాజ్ మాట్లాడుతూ పొరుగు దేశాలను తమను బిచ్చగాళ్లలా చూస్తున్నాయని, తమ నుంచి ఫోన్ వెళ్తే డబ్బులు అడుగతారేమోనని భయపడే పరిస్థితులు కొనసాగుతున్నాయని అన్నారు. ప్రధానే ఈ స్థాయిలో చెప్పారంటే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఏ స్థాయిలో ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు.

Congress President Poll: అధ్యక్ష రేసుపై శశి థరూర్ ఆత్మవిశ్వాసం.. కాంగ్రెస్, గాంధీ కుటుంబం మద్దతు తనకే ఉందట