Bharath-Pak : అట్టారీ-వాఘా సరిహద్దుల్లో స్వీట్లు పంచుకున్న భారత్, పాక్ సైనికులు

భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల్లోని పంజాబ్ బోర్డర్ లో ఉన్న అట్టారీ-వాఘా సరిహద్దుల్లో పాకిస్థాన్ రేంజర్లు, భారత బీఎస్ఎఫ్ జవాన్లు మిఠాయిలు పంచుకున్నారు. ఈరోజు ఆగస్టు 14 పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాక్ సైనికులు భారత్ సైనికులకు స్వీట్లు పంచారు. అనంతరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Bharath-Pak : అట్టారీ-వాఘా సరిహద్దుల్లో స్వీట్లు పంచుకున్న భారత్, పాక్ సైనికులు

India And Pakistan Soldiers Shares Sweets

India and Pakistan soldiers shares sweets : ఒకప్పుడు అఖండ భారతంగా ఉన్న భారత్ ముక్కలుగా విడిపోయింది. ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించాక భారత్-పాకిస్థాన్ దేశాలుగా విడిపోయింది. అలా పాకిస్థాన్ కు ఈరోజు అంటే ఆగస్టు 14న పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు చేసుకుంటోంది. రేపు అంటే ఆగస్టు 15 భారతదేశం స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు అంగరంగ వైభోగంగా జరుపుకోనుంది.

ఈరోజు పాకిస్థాన్ స్వాత్రంత్య్ర దినోత్సవం సందర్బంగా అట్టారీ-వాఘా సరిహద్దు వద్ద భారత్-పాకిస్థాన్ జవాన్లు స్వీట్లు పంచుకున్నారు. శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈరోజు పాక్ సోదరులు వారి స్వాత్రంత్య్ర దినోత్సవం సందర్భంగా మాకు స్వీట్లు పంచారు. రేపు మనదేశపు స్వాతంత్ర్య దినోత్సం సందర్భంగా మేం వారికి మిఠాయిలు పంచుతామని రేపు కూడా స్వీట్లు బీఎస్ఎఫ్ కమాండెంట్ జస్బీర్ సింగ్ తెలిపారు.

భారత్-పాకిస్థాన్ సరిహద్దులెప్పుడూ చాలా ఉద్రిక్తంగా ఉంటాయి. ఇరు దేశాల సైనికులు ఆయుధాలతో అనుక్షణం అప్రమత్తంగా ఉంటారు. అనుక్షణం వేయి కళ్లతో కావలికాస్తుంటారు. కొన్ని సందర్భాల్లో తుపాకుల కాల్పులు, మోర్టార్ల ప్రయోగాలతో దేశ సరిహద్దులు దద్దరిల్లిపోతుంటాయి. యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంటాయి. కానీ ఈరోజు రేపు చాలా ప్రత్యేకమైనవి. ఈరోజు సరిహద్దుల వద్ద ఇరు దేశాల సైనికులు స్వీట్లు పంచుకున్నారు. శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ రోజు పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం కావడమే దీనికి కారణమనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.

పంజాబ్ బోర్డర్ లో ఉన్న అట్టారీ-వాఘా సరిహద్దుల్లో పాకిస్థాన్ రేంజర్లు, భారత బీఎస్ఎఫ్ జవాన్లు మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ కమాండెంట్ జస్బీర్ సింగ్ మాట్లాడుతూ..రేపు మన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాక్ జవాన్లకు స్వీట్లు బహుమతిగా ఇస్తామని తెలిపారు. 1947 ఆగస్ట్ 14న అఖండ భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోయింది. దీంతో, వారు మన కంటే ఒక్కరోజు ముందుగానే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటారు. ఆగస్టు 15న మనం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటాం. కానీ ఈ ఏడాది ఈ వేడుకలకు ఓ ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మనకు స్వాతంత్ర్యం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తి అయ్యాయి.

ఈ శుభ సందర్భంగా భారత్ ఈ ఏడాది పొడవున అజాది అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తుంది.ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే చాలా మంది యువత స్వచ్చంద సంస్థలు, ప్రైవేటు కార్యాలయాలు అజాది అమృత్ మహోత్సవాలను జరుపుకుంటున్నారు.