భారత్‌లో ఉగ్రదాడులకు పాక్ వ్యూహం

జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత రగిలిపోతున్న పాకిస్తాన్..భారత్‌లో మరిన్ని దాడులకు వ్యూహం రచిస్తోంది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలంటూ అమెరికా హెచ్చరికలు జారీ చేసింది.

  • Published By: veegamteam ,Published On : October 2, 2019 / 10:03 AM IST
భారత్‌లో ఉగ్రదాడులకు పాక్ వ్యూహం

జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత రగిలిపోతున్న పాకిస్తాన్..భారత్‌లో మరిన్ని దాడులకు వ్యూహం రచిస్తోంది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలంటూ అమెరికా హెచ్చరికలు జారీ చేసింది.

జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత రగిలిపోతున్న పాకిస్తాన్..భారత్‌లో మరిన్ని దాడులకు వ్యూహం రచిస్తోంది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలంటూ అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్ కనుక మిలిటెంట్ గ్రూపులను కట్టడి చేయకపోతే.. కశ్మీర్‌లో మరిన్ని దాడులు జరుగుతాయంటూ జరుగుతాయని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. డిఫెన్స్ ఫర్ ఇండో పసిఫిక్ అఫైర్స్ సెక్రటరీ రండాల్ ష్రివర్..బుధవారం (అక్టోబర్2, 2019) వాషింగ్టన్‌లో జరిగిన ఓ సమావేశంలో ఈ విషయాన్ని చెప్పారు. 

ఆర్టికల్ 370 రద్దు విషయంలో చైనా పాకిస్తాన్‌కి మద్దతు ఇవ్వడమనేది..కేవలం దౌత్యపరంగానే తప్ప..ఇంకేరకంగానూ చైనా మద్దతు ఇవ్వదని..ముఖ్యంగా ఉగ్రదాడుల విషయంలో పాకిస్తాన్‌కి చైనా సపోర్ట్ ఇవ్వదని కూడా ఈ సందర్భంగా రండాల్ ష్రివర్ అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేయడమో లేకుంటే..వారిని ఏరిపారేయడమో మాత్రం పాకిస్తాన్ ముందున్న దారులను ఆయన చెప్పారు. 

ఐతే అమెరికా జారీ చేసిన హెచ్చరికలను పాకిస్తాన్ ఏమేరకు లెక్కచేస్తుందన్న విషయమే ఇప్పుడు తేలాల్సి ఉంది..పంజాబ్‌లోడ్రోన్ల ద్వారా ఆయుధాలను విడవడం..జమ్ములో విధ్వంసం కోసం ఆర్డీఎక్స్ తరలించడం వంటి సంఘటనలు ఈ మధ్య చోటు చేసుకున్నాయి. వీటి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందన్నది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఈ క్రమంలోనే అమెరికా ఉగ్రదాడుల విషయంలో హెచ్చరికలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.