Pak president : భారత్‌తో సంబంధాలపై పాక్ నూతన ప్రధాని షెహబాజ్ కీలక వ్యాఖ్యలు.. వక్రబుద్ధి బయటపెట్టిండు..

పాకిస్థాన్ నూతన ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్ షరీఫ్ తన తొలి ప్రసంగంలో భారత్‌తో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు భారత్‌తో సత్సంబంధాలు మెరుగుపర్చుకొనేందుకు తాము సిద్ధమంటూనే...

Pak president : భారత్‌తో సంబంధాలపై పాక్ నూతన ప్రధాని షెహబాజ్ కీలక వ్యాఖ్యలు.. వక్రబుద్ధి బయటపెట్టిండు..

Pak New Prcident

Pak president : పాకిస్థాన్ నూతన ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్ షరీఫ్ తన తొలి ప్రసంగంలో భారత్‌తో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు భారత్‌తో సత్సంబంధాలు మెరుగుపర్చుకొనేందుకు తాము సిద్ధమంటూనే మరోపక్క భారత్ పై అక్కస్సు వెళ్లగక్కాడు. కాశ్మీర్ వివాదం పరిష్కారమైతే తప్ప భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడవని, కాశ్మీర్ లోయ నెత్తరోడుతోందని, అక్కడి ప్రజలకు దౌత్యపరమైన, నైతిక మద్దతు అందిస్తామంటూ షెహబాజ్ వ్యాఖ్యానించారు. జమ్మూ-కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తికి ఉద్దేశించిన ఆర్టికల్ -370 రద్దు సహా పలు అంశాలను పాక్ నూతన ప్రధాని ప్రస్తావించారు. ఆది నుంచీ భారత్ – పాక్ మధ్య సత్సంబంధాలు లేవని పేర్కొన్నారు.

Pakistan politics : పాక్ ప్రధాని పదవికి షాబాజ్ నామినేషన్.. నేడు ఎన్నిక.. గెలుపు లాంఛనమే.. ఆసక్తికర ట్వీట్ చేసిన ఇమ్రాన్

కశ్మీరీలకు రాజకీయపరంగా, దౌత్యమార్గాల్లో, నైతికంగా మేం మద్దతు కొనసాగిస్తామని, అక్కడి సోదర సోదరీమణుల వాణిని ప్రతి అంతర్జాతీయ వేదికపై వినిపిస్తామని షెహబాజ్ పేర్కొన్నారు. ఐక్య రాజ్య సమితి తీర్మానాలు, కశ్మీరీల అంచనాలకు అనుగుణంగా కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత్ ప్రధాని మోదీ ముందుకు రావాలని షెహబాజ్ పిలుపునిచ్చారు. ఈ సమస్య పరిష్కారమైతే ఇరుదేశాలు పేదరికం, నిరుద్యోగంలాంటి ఇతర కీలకాంశాలపై దృష్టి పెట్టవచ్చని షెహాబాజ్ పేర్కొన్నారు. ఇదిలాఉంటే ఆది నుంచి పాక్ – భారత్ మధ్య సత్సంబంధాలు నామమాత్రంగానే ఉంటూ వచ్చాయి. పఠాన్ కోట్ దాడి తర్వాత ఇండో – పాక్ సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. 2019లో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా తొలగించడం, అధికరణ 370ని రద్దు చేయడంతో పాక్‌లోని భారత్ హైకమిషనర్‌ను పాక్ బహిష్కరించింది. అనంతరం భారత్‌తో వాయు, భూమార్గాలను మూసివేసింది. వాణిజ్యాన్ని, రైల్వే సేవలను నిలిపివేసింది. ఉగ్రవాదులకు పాక్ మద్దతు నిలిపివేస్తే చర్చలు జరుపుతామని భారత్ తేల్చి చెబుతోంది.

Pak politics : ఇమ్రాన్ ఖాన్ ఔట్.. అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన విపక్షాలు.. అర్థరాత్రి వరకు కొనసాగిన రాజకీయ హైడ్రామా

పాకిస్థాన్ లో గతకొద్ది రోజులుగా కొనసాగుతున్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. పాక్ పార్లమెంట్ లో నాటకీయ పరిణామాల మధ్య జరిగిన అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కుప్పకూలింది. సోమవారం విపక్షాల మద్దతుతో ఉమ్మడి అభ్యర్థిగా పాకిస్థాన్ ముస్లిం లీగ్ – నవాజ్ (పీఎంఎల్ – ఎన్) అధ్యక్షుడు షెహబాజ్ పాకిస్థాన్ 23వ ప్రధాన మంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. విపక్షాల మద్దతుతో ఏర్పాటైన ప్రభుత్వంలో షెహబాజ్ ఎన్నిరోజులు ప్రధానిగా ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. విపక్షాల మధ్య ఎలాంటి విబేధాలు తలెత్తనంత వరకు షెహబాజ్ కు ఇబ్బందులు ఉండవని, 2023 సంవత్సరం చివరి వరకు ప్రధానిగా కొనసాగవచ్చని, అలాకాకుండా విపక్షాల మధ్య విబేధాల పొడచూపితే షెహబాజ్ ప్రధాని పదవి నుండి ఎప్పుడైనా దిగిపోయే ఆస్కారం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.