Pak politics : ఇమ్రాన్ ఖాన్ ఔట్.. అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన విపక్షాలు.. అర్థరాత్రి వరకు కొనసాగిన రాజకీయ హైడ్రామా

పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ పాత్ర ముగిసింది. ఇమ్రాన్ సర్కార్‌పై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మాన ఓటింగ్ లో విపక్షాలు నెగ్గాయి. అర్థరాత్రి వరకు సాగిన రాజకీయ హైడ్రామా నడుమ ..

Pak politics : ఇమ్రాన్ ఖాన్ ఔట్.. అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన విపక్షాలు.. అర్థరాత్రి వరకు కొనసాగిన రాజకీయ హైడ్రామా

Pak Parlament (2)

Pak politics : పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ పాత్ర ముగిసింది. ఇమ్రాన్ సర్కార్‌పై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మాన ఓటింగ్ లో విపక్షాలు నెగ్గాయి. అర్థరాత్రి వరకు సాగిన రాజకీయ హైడ్రామా నడుమ చివరకు విపక్షాలన్నీ ఏకమై ఇమ్రాన్ సర్కార్ ను క్లీన్ బౌల్డ్ చేశాయి. శనివారం ఉదయం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించేందుకు పాక్ జాతీయ అసెంబ్లీ సమావేశమైంది. సభ ప్రారంభమైన దగ్గర నుంచి విదేశీ కుట్రపై చర్చకు అధికార పార్టీ సభ్యులు పట్టుబట్టడంతో విపక్ష, అధికార పక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఉదయం నుంచి ఇదే పరిస్థితి ఉండటంతో పలు సార్లు సభ వాయిదా పడుతూ వచ్చింది. అర్థరాత్రి వరకు ఇదే తంతు కొనసాగింది.

Imran Khan : పాక్ అసెంబ్లీలో గందరగోళం.. హాజరుకాని ఇమ్రాన్.. ఓటింగ్ వాయిదా పడేలా ప్లాన్..
అర్థరాత్రి సమయంలో తన నివాసంలో ఇమ్రాన్ కీలక కేబినెట్ భేటీ నిర్వహించారు. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా, ఐఎస్ఐ చీఫ్ సైతం ఇమ్రాన్ ను కలుసుకున్న కొద్దిసేపటికే పాక్ జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగింది. 342 మంది సభ్యులున్న పాక్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ప్రభుత్వంపై అవిశ్వాసానికి 174 మద్దతు పలికారు. దీంతో ఇమ్రాన్ ఓటమి లాఛనంగా మారింది. ఓటింగ్ సమయంలో ఇమ్రాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రిక్ ఏ ఇన్సాప్ (పీటీఐ)సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఇమ్రాన్ ఉదయం నుంచి సభకు హాజరుకాలేదు. మరోవైపు ఓటింగ్ జరుగుతున్న సమయంలోనే ఇమ్రాన్ తన అధికారిక నివాసాన్ని ఖళీ చేసి వెళ్లిపోయారు. ఓటింగ్ అనంతరం విపక్షాలు నెగ్గడంతో పాకిస్థాన్ ముస్లిం లీగ్ – నవాజ్ పార్టీ అధినేత షెహబాజ్ షరీఫ్ ( నవాజ్ షరీఫ్ సోదరుడు) తదుపరి ప్రధాని అయ్యే అవకాశం ఉంది.

Imran Khan: సుప్రీం చేతిలో ఓడిపోయిన ఇమ్రాన్ ప్రభుత్వం

సుప్రింకోర్టు తీర్పు మేరకుఅవిశ్వాస తీర్మానపై ఓటింగ్ కు సమావేశమైన జాతీయ అసెంబ్లీ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఉదయం 10:30 గంటలకు సమావేశం కాగా ప్రతిపక్ష, అధికార పక్షాల మధ్య వాగ్వివాదంతో సభ వాయిదా పడింది. సభ ప్రారంభమైన వెంటనే ఇమ్రాన్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు విదేశీకుట్రపై చర్చజరపాలని అధికార పక్ష సభ్యులు పట్టుబట్టారు. దీంతో స్పీకర్ అసద్ ఖైసర్ సైతం అందుకు మొగ్గుచూపడంతో విపక్షాలు అవిశ్వాస తీర్మానంకు ఓటింగ్ నిర్వహించాలని పట్టుబట్టారు. దీంతో సభ మధ్యాహ్నం 1గంటకు వాయిదా పడింది. మళ్లీ సమావేశమైనప్పటికీ విపక్ష, అధికార పక్ష సభ్యుల మధ్య జరిగిన వాదనలతో సభ పలుమార్లు వాయిదా పడింది.

Imran Khan: రాజీనామా చేయను.. మాపై ఓ దేశం కుట్ర చేస్తోంది: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

రాత్రి 9గంటల సమయంలో ఇమ్రాన్ ఖాన్ అత్యవసర కేబినెట్ భేటీ నిర్వహించడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. చివరి వరకు పార్లమెంట్ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగొద్దని అధికార పార్టీ సభ్యులు వ్యూహాలు పన్నినప్పటికీ చివరకు అర్థరాత్రి 12.30గంటల సమయంలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్ కు ముందు అనూహ్య రీతిలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు రాజీనామా చేశారు. దీంతో ప్రతిపక్ష పీఎంఎల్ – ఎన్ నేత అయాజ్ సాధిక్ స్పీకర్ గా వ్యవహరించి ఓటింగ్ చేపట్టారు.