Pandora Papers: అంతర్జాతీయ సీక్రెట్ బయటపెట్టిన పాండోరా.. మరోసారి ఆర్థిక నేరగాళ్ల గుట్టురట్టు

పన్ను ఎగవేతదారుల సీక్రెట్ పేపర్స్ లీక్ చేస్తూ.. పాండోరా పేపర్లు మరోసారి గుట్టురట్టు చేశాయి. 117 దేశాల్లోని 600మంది జర్నలిస్టులు పాల్గొన్న ఈ సీక్రెట్ ఆపరేషన్‌లో భారతీయులు ఉన్నారు.

Pandora Papers: అంతర్జాతీయ సీక్రెట్ బయటపెట్టిన పాండోరా.. మరోసారి ఆర్థిక నేరగాళ్ల గుట్టురట్టు

Pandora Papers

Pandora Papers: పన్ను ఎగవేతదారుల సీక్రెట్ పేపర్స్ లీక్ చేస్తూ.. పాండోరా పేపర్లు మరోసారి గుట్టురట్టు చేశాయి. 117 దేశాల్లోని 600మంది జర్నలిస్టులు పాల్గొన్న ఈ సీక్రెట్ ఆపరేషన్ లో 380 మంది భారతీయ ఆర్థిక నేరగాళ్ల చరిత్ర కూడా ఉంది. ఐదు సంవత్సరాల క్రితం పనామా పేపర్ల కంటే పవర్‌ఫుల్ ఈ పాండోరా పేపర్లు. జాబితాలో 91 దేశాలకు చెందిన వందలమంది ప్రస్తుత, మాజీ ప్రపంచ నేతలు, పొలిటీషియన్స్, వ్యాపారవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు ఉన్నారు.

పాండోరా పేపర్ల పేరుతో ఆదివారం రాత్రి ప్రముఖుల బాగోతాలను వెలుగులోకి తీసుకొచ్చాయి. తక్కువ పన్ను గల దేశాలకు రహస్య సంపదను అక్రమంగా పెద్దఎత్తున తరలించి పెట్టుబడులు పెట్టిన వివరాలు వీటిలో ఉన్నాయి. ఇంటర్నేషనల్‌ కన్సార్షియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌ (ఐసీఐజే) ఈ డిటైల్స్ రిలీజ్ చేసింది.

జర్నలిస్టుల కూటమి వేర్వేరు దేశాల్లోని దాదాపు 1.20 కోట్ల ఆర్థిక లావాదేవీల పత్రాలను పరిశీలించి గుట్టుమట్లు రట్టు చేసింది. 2.94 టెరాబైట్ల మేర సమాచారం ఉందని ఇంతేకాకుండా రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

………………………………………………….: విజయఢంకా మోగించిన దీదీ.. ఎంత ఖర్చు పెట్టారో తెలుసా?

భారత్‌, అమెరికా, రష్యా సహా 45 దేశాలకు చెందిన 130 మంది బిలియనీర్లు ఈ జాబితాలో ఉన్నారు. 336 మంది ఉన్నతస్థాయి అధికారులకు విదేశాల్లో 956 కంపెనీల పేరిట పెట్టుబడులు ఉన్నట్లు తెలిసింది. మారుపేర్లతో తెరిచిన బ్యాంక్ అకౌంట్ల సాయంతో ఆస్తులను సీక్రెట్ గా కొనుగోలు చేశారు. పనామా, దుబాయ్‌, మొనాకో, స్విట్జర్లాండ్‌, కేమన్‌ ఐలాండ్స్‌ వంటి చోట్ల సీక్రెట్ గా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు చేశారు.

-> భారత పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీకి 18 అసెట్‌ హోల్డింగ్‌ ఆఫ్‌షోర్‌ కంపెనీలు ఉన్నాయి.
-> నీరవ్‌ మోదీ భారత్‌ వీడటానికి నెల ముందు అతని సోదరి ఒక ట్రస్టు ఏర్పాటు చేశారు.
-> జోర్డాన్‌ రాజు అబ్దుల్లా-2 అమెరికా, బ్రిటన్‌లలో రహస్యంగా సుమారు రూ.741 కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టారు.
-> బ్రిటన్‌ మాజీ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్‌, ఆయన సతీమణి.. దొడ్డిదారిన రూ.3.14 కోట్ల (3,12,000 పౌండ్లు) స్టాంపు డ్యూటీ ప్రయోజనం పొందారు.
-> పాకిస్థాన్‌ ఆర్థికమంత్రి సౌకత్‌ తారిన్‌, ఇమ్రాన్‌ మాజీ సలహాదారుడు వకార్‌ మసూద్‌ ఖాన్‌ (రెవెన్యూ, ఆర్థికం) కుమారుడు సహా 700 మంది పాకిస్థానీలు ఉన్నారు.
-> రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మొనాకోలో ఆస్తులున్నాయని పరోక్షంగా చెప్పింది.