Indian origin CEOs : సీఈవోల ఫ్యాక్టరీగా భారత్ .. ప్రపంచ వ్యాప్తంగా పలు కార్పోరేట్ కంపెనీల్లో భారతీయుల హవా..

దేశాధినేతలు, దేశాల ప్రధానులు మాత్రమే కాదు.. ప్రపంచంలోని ఎన్నో టాప్ కంపెనీలకు మన భారతీయులే సీఈవోలుగా ఉన్నారు. వాటి సక్సెస్‌లో.. మేజర్ రోల్ మనవాళ్లదే. ఈ జనరేషన్.. ఇండియన్స్‌ని గట్టిగా నమ్ముతోందనడానికి.. వీళ్లే బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్స్. గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబీ ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు కంపెనీలకు భారతీయులే సీఈవోలుగా కొనసాగుతున్నారు.

Indian origin CEOs  : సీఈవోల ఫ్యాక్టరీగా భారత్ .. ప్రపంచ వ్యాప్తంగా పలు కార్పోరేట్ కంపెనీల్లో భారతీయుల హవా..

Indian origin CEOs

Indian origin CEOs : దేశాధినేతలు, దేశాల ప్రధానులు మాత్రమే కాదు.. ప్రపంచంలోని ఎన్నో టాప్ కంపెనీలకు మన భారతీయులే సీఈవోలుగా ఉన్నారు. వాటి సక్సెస్‌లో.. మేజర్ రోల్ మనవాళ్లదే. ఈ జనరేషన్.. ఇండియన్స్‌ని గట్టిగా నమ్ముతోందనడానికి.. వీళ్లే బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్స్. గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబీ ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు కంపెనీలకు భారతీయులే సీఈవోలుగా కొనసాగుతున్నారు.

ఇప్పుడు ప్రపంచాన్ని నడిపిస్తుంది ఇండియన్స్ అనడంలో.. ఏమాత్రం అతిశయోక్తి లేదు. భారతీయుల ప్రతిభ అటువంటిది. ప్రపంచంలోని టాప్ కార్పొరేట్ కంపెనీలకు.. మన భారతీయులే సీఈవోలు. వాటిని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తూ.. ఇండియన్స్‌కి ఎవరూ సాటిలేరని నిరూపిస్తున్నారు. ఈ లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సింది సుందర్ పిచాయ్ గురించే. గ్లోబల్ కంపెనీలకు సీఈవోలుగా వ్యవహరిస్తున్న భారతీయుల గురించి ప్రస్తావన వస్తే.. అందులో మొదటగా మెరిసేది సుందర్ పిచాయ్ పేరే. ఐఐటీ ఖరగ్‌పూర్ గ్రాడ్యుయేట్. 2015 నుంచి గూగుల్ సీఈవోగా కొనసాగుతున్నారు. అంతేకాదు.. 2019లో గూగుల్ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్‌‌కి కూడా సుందర్ పిచాయ్‌నే సీఈవోగా చేశారంటే.. అతని సేవలు ఎంత ముఖ్యమైనవో అర్థం చేసుకోవచ్చు.

సిలికాన్ వ్యాలీకి చెందిన మరో బిగ్ నేమ్.. సత్య నాదెళ్ల. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన సత్య నాదెళ్ల.. యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మిల్వాకీ, యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. 2014లో.. మెక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. దీంతో.. భారత సంతతికి చెందిన ప్రభావవంతమైన సీఈవోల లిస్టులో సత్య నాదెళ్ల కూడా చేరిపోయారు. మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీని సరికొత్త పుంతలు తొక్కిస్తూ సత్తా చాటుతున్నారు సత్య నాదెళ్ల.

ఈ లిస్టులో.. మరో పెద్ద పేరుంది. అదే.. పరాగ్ అగర్వాల్. ప్రస్తుతం.. ఇతను టాప్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్‌కు సీఈవోగా కొనసాగుతున్నారు. ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ.. సీఈవోగా వైదొలిగిన తర్వాత.. పరాగ్ అగర్వాల్‌ను.. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించారు. పరాగ్.. బాంబే ఐఐటీలో బీటెక్ పూర్తి చేశాక.. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను కొనసాగించారు. యాహూ, మైక్రోసాఫ్ట్ సహా దిగ్గజ కంపెనీల్లోనూ పనిచేశారు. ట్విట్టర్‌ కొనుగోలు వ్యవహారంలో ఎలాన్ మస్క్‌తో సై అంటే సై అంటూ వరల్డ్‌వైడ్‌ అటెన్షన్ గ్రాబ్‌ చేశారు పరాగ్‌ అగర్వాల్‌.

Leaders of Indian Origin in the World : ప్రపంచ దేశ రాజకీయాలను శాసిస్తున్న మన భారతీయులు .. పలు దేశాల్లో భారత సంతతి వ్యక్తులదే కీ రోల్..

చానల్ గ్రూప్ సీఈవోగా ఉన్న లీనా నాయర్ కూడా భారత సంతతికి చెందిన మహిళే. ఈవిడ.. భారతీయ మూలాలున్న తొలి మహిళా సీఈవో మాత్రమే కాదు.. చానల్ గ్రూప్‌లో చిన్న వయస్సులో సీఈవో స్థాయికి ఎదిగిన తొలి మహిళ కూడా. గతంలో.. యూనిలీవర్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్‌గానూ పనిచేశారు. జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ వాల్‌చంద్ కాలేజీలో.. ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇక.. హైదరాబాద్‌లో పుట్టి.. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న శంతను నారాయణ్ 2007 నుంచి అడోబీ కంపెనీ సీఈవోగా కొనసాగుతున్నారు. అంతకుముందు.. అడోబ్‌ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గానూ పనిచేశారు. శంతను.. బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఉన్నత చదువులను పూర్తి చేశారు.

ఐబీఎం ఛైర్మన్, సీఈవో కూడా భారతీయుడే. ఐఐటీ కాన్పూర్‌లో చదువుకున్న అరవింద్ కృష్ణ ప్రస్తుతం ఐబీఎం సీఈవోగా కొనసాగుతున్నారు. తన స్టూడెంట్ లైఫ్ అంతా ఇండియాలోనే గడిపిన అరవింద్ కృష్ణ.. యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా ఛాంపెయిన్‌లో.. ఉన్నత విద్యను అభ్యసించారు. 2020 ఏప్రిల్‌లో.. ఐబీఎం సీఈవోగా నియమితులయ్యారు. తర్వాత ఏడాదిలోనే.. అదే కంపెనీకి ఛైర్మన్‌గానూ బాధ్యతలు స్వీకరించారు. కాన్పూర్‌లో జన్మించిన సంజయ్ మెహోత్రా.. 2017లో మైక్రోన్ టెక్నాలజీస్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఆయన.. శాండిస్క్ సహ వ్యవస్థాపకుడు కూడా. 2016లో.. ఆ కంపెనీకి కూడా సీఈవోగా పనిచేశారు. సంజయ్ కాన్పూర్‌లోనే జన్మించారు. పిట్స్ పిలానీలో చదువుకున్నారు. యూసీ బర్కెలీలో.. ఉన్నత విద్యను పూర్తి చేశారు.

పాలో ఆల్టో నెట్‌వర్క్స్ సీఈవో నికేశ్ అరోరా కూడా భారతీయుడే. 2018లో.. ఆ కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు. ఈయన.. ఐఐటీతో పాటు బనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నారు. తర్వాత.. బోస్టన్ కాలేజీ, నార్త్‌స్టెర్న్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను కొనసాగించారు. ఇక.. లండన్‌లో జన్మించి.. భారత్‌లో పెరిగిన జయశ్రీ ఉల్లాల్.. 2008 నుంచి అరిస్టా నెట్‌వర్క్స్ కంపెనీ సీఈవో, ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. ఈవిడ.. శాంటాక్లారా యూనివర్సిటీ, శాన్‌ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ముంబైలో జన్మించిన ఆమ్రపాలి గాన్.. ఓన్లీ ఫ్యాన్స్ సీఈవోగా పనిచేస్తున్నారు. ఆ సంస్థ వ్యవస్థాపకుడు టిమ్ స్టోలీ తర్వాత.. 2021లో ఆమ్రపాలి ఈ పదవి చేపట్టారు. ఈ అమ్మాయి.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో చదువుకున్నారు.

ఇక.. వరల్డ్ వైడ్ ఎన్నో బ్రాంచ్‌లు కలిగిన.. ఫేమస్ స్టార్ బక్స్ సీఈవోగా లక్ష్మణ్ నరసింహన్ ఉన్నారు. సావిత్రిబాయి ఫూలే పాలిటెక్నిక్ కాలేజీలో.. లక్ష్మణ్ ఇంజనీరింగ్ చదివారు. ఆ తర్వాత.. జర్మనీ, పెన్సిల్వేనియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇక.. మాస్టర్ కార్డ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్నది కూడా భారతీయుడే. అతనే.. అజయ్‌పాల్ సింగ్ బంగా. ఇతను.. ఐఐటీ స్టూడెంట్. 2020 వరకు.. మాస్టర్ కార్డ్ కంపెనీకి సీఈవోగానూ పనిచేశారు.

ప్రపంచ దేశాలను పాలించడంలోనే కాదు.. దిగ్గజ కార్పొరేట్ కంపెనీలను సైతం భారతీయులు ముందుండి నడిపిస్తున్నారు. ఇక.. బ్రిటన్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీలను కొన్నది కూడా మన టాటా కంపెనీయే. అతిపెద్ద స్టీల్ సామ్రాజ్యం కూడా మనోళ్లదే. ఇలా.. ప్రపంచంలో ఏ మూలన చూసినా.. ఎంతో కొంత ఇండియన్ కాంట్రిబ్యూషన్ కనిపిస్తుంది. ఇందుకు.. మనం చూసిన ఎగ్జాంపుల్స్ కొన్ని మాత్రమే. మన దాకా రానివి.. ఇంకా చాలానే ఉన్నాయ్.