మార్స్‌పై తొలి అడుగులు మొదలెట్టిన నాసా రోవర్

మార్స్‌పై రీసెర్చ్ కోసం నాసా పంపిన పర్సెవరెన్స్‌ రోవర్‌ తాజాగా అంగారక ఉపరితలంపై టెస్ట్‌డ్రైవ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసింది. పరిశోధనలు ప్రారంభించే ముందు ఈ రోవర్‌ 6.5 మీటర్ల మేర ప్రయాణం చేసింది.

మార్స్‌పై తొలి అడుగులు మొదలెట్టిన నాసా రోవర్

Perseverance Rover: మార్స్‌పై రీసెర్చ్ కోసం నాసా పంపిన పర్సెవరెన్స్‌ రోవర్‌ తాజాగా అంగారక ఉపరితలంపై టెస్ట్‌డ్రైవ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసింది. పరిశోధనలు ప్రారంభించే ముందు ఈ రోవర్‌ 6.5 మీటర్ల మేర ప్రయాణం చేసింది. సుమారు 33 నిమిషాల సమయం పట్టిందని నాసా వెల్లడించింది.

రోవర్‌ పనితీరులో ఇది పెద్ద ముందడుగుగా పేర్కొన్నారు. రోవర్‌లోని ప్రతి సిస్టమ్ పనితీరును చెక్‌ చేసుకునేందుకు ఈ టెస్ట్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఇతర గ్రహాలపై రోవర్ల టెస్ట్‌ డ్రైవ్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని, పర్సెవరెన్స్‌ ఈ పనిని అద్భుతంగా నిర్వహించిందన్నారు. దీని ఫలితంగా రాబోయే రెండేళ్ల పాటు రోవర్‌ పనితీరు బాగుంటుందని నమ్ముతున్నామని నాసా సైంటిస్టు అనైస్‌ జరిఫియన్‌ చెప్పారు.

రీసెర్చ్‌లలో భాగంగా రోవర్‌ 200 మీటర్ల దూరాలను కూడా కవర్‌ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ రోవర్‌ ఫిబ్రవరి 18న మార్స్‌పై లాండ్‌ అయింది. రాళ్లు, మట్టిని పరిశోధించడం, సూక్ష్మజీవుల ఉనికిని అన్వేషించడం, మనిషి లాండ్‌ అయ్యే అవకాశాలను పరిశీలించేందుకు దీనిని ప్రోగ్రాం చేశారు.