Forgetfulness : మతిమరుపును తగ్గించే మాత్ర!

మతిమరుపుతో బాధపడే వారికి గుడ్ న్యూస్. వయసు పైబడిన వారిని వేధించే అల్జీమర్స్‌ వ్యాధిని నయం చేయడంలో కీలక ముందడుగు పడింది. అల్జీమర్స్‌ను తగ్గించే మాత్రను జపాన్‌కు చెందిన ఎయ్‌సాయ్‌ ఫార్మా కంపెనీ తయారు చేసింది.

Forgetfulness : మతిమరుపును తగ్గించే మాత్ర!

An amnesia pill

Forgetfulness : వయసు మీద పడే కొద్దీ మతిమరుపు వస్తుంది. మతిమరుపుతో బాధపడే వారికి గుడ్ న్యూస్. వయసు పైబడిన వారిని వేధించే అల్జీమర్స్‌ వ్యాధిని నయం చేయడంలో కీలక ముందడుగు పడింది. అల్జీమర్స్‌ను తగ్గించే మాత్రను జపాన్‌కు చెందిన ఎయ్‌సాయ్‌ ఫార్మా కంపెనీ తయారు చేసింది. అల్జీమర్స్‌ ప్రాథమిక దశలో ఉన్న దాదాపు 1,800 మంది వ్యాధిగ్రస్తులకు ఈ మాత్ర అందించి 18 నెలలు పరీక్షించగా, 27 శాతం వ్యాధి తీవ్రత తగ్గింది.

Vitamin Deficiency : ఆ.. విటమిన్ లోపిస్తే… మతిమరుపు, గుండె సమస్యలు!..

దీనికి సంబంధించిన పరిశోధన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని సదరు కంపెనీ వెల్లడించింది. ప్రాథమిక ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని పేర్కొంది. ఇప్పటికే యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అనుమతి కోసం దరఖాస్తు చేసినట్టు తెలిపింది.