P&O Sackings : జూమ్ కాల్‌‌లో 800 మంది ఉద్యోగుల తొలగింపు.. ప్రధాని గుస్సా

మూడు నిమిషాల జూమ్ కాల్ లో ఏకంగా 800 మందిని తొలగించారు ఓ సీఈవో. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు...

P&O Sackings : జూమ్ కాల్‌‌లో 800 మంది ఉద్యోగుల తొలగింపు.. ప్రధాని గుస్సా

Jobs

P&O Ferries : జూమ్ కాల్ లో ఉద్యోగులను తొలగించడం ఇప్పుడు కామన్ అయిపోయింది. జూమ్ మీటింగ్ లో మూడు నిమిషాల్లో 900 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించి… విశాల్ గార్డ్ వార్తల్లోకి ఎక్కారు. ఈయన బెటర్ డాట్ కామ్ అనే సంస్థ ద్వారా మోర్టగేజ్ లెండింగ్ కార్యకలాపాలని నిర్వహిస్తున్నారు. తాజాగా.. ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. మూడు నిమిషాల జూమ్ కాల్ లో ఏకంగా 800 మందిని తొలగించారు ఓ సీఈవో. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది.

Read More : David Cameron: యుక్రెయిన్ల కోసం స్వయంగా ట్రక్ నడుపుకుంటూ వెళ్లిన యూకే మాజీ ప్రధాని

యూకేలో పీ అండ్ ఓ బ్రిటీష్ షిప్పింగ్ కంపెనీ యూకే, ఐర్లాండ్, యూరప్ దేశాల్లో వ్యాపారాలను నిర్వహిస్తోంది. దీనిని సీఈవోగా జానెట్ బెల్ వ్యవహరిస్తున్నారు. కరోనా కాలంలో… లాకౌడౌన్ విధించడంతో ఈ సంస్థకు కష్టాలు ఎదురయ్యాయి. 1100 మంది ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు డబ్బులు సమకూరలేదు. దీంతో యూకే ప్రభుత్వం నుంచి 10 మిలియన్లను అప్పుగా తీసుకుంది పీ అండ్ ఓ యాజమాన్యం. అయితే.. రెండు సంవత్సరాల్లో ఏకంగా 200 మిలియన్ డాలర్ల నష్టాన్ని చవి చూసింది.

Read More : Shocking : 24,000 ఏళ్లుగా మంచులోనే బతికే ఉన్న వింత జీవి..!

యూకే ప్రభుత్వం ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేశారని, తిరిగిన మొత్తాన్ని చెల్లించలేదని ఆరోపణలు వినిపించాయి. దీంతో నష్టాలను వెల్లడిస్తూ… జూమ్ కాల్ మీటింగ్ లో 800 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు జానెట్ బెల్ వెల్లడించారు.దీనిపై ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ స్పందించారు. ఉద్యోగం నుంచి తీసివేయడం సరైన పద్ధతి కాదని, కరోనా కాలంలో సంస్థ వెంటే ఉద్యోగులున్నారనే విషయాన్ని వెల్లడించారు. అలాంటి ఉద్యోగుల పట్ల మర్యాదగా మెలగాల్సినవసరం ఉందని, కంపెనీ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన సూచించారు.