గర్భిణులు కరోనా వ్యాక్సిన్‌ ఎప్పుడు తీసుకుంటే మంచిది? నిపుణులు ఏమంటున్నారంటే?

గర్భిణులు కరోనా వ్యాక్సిన్‌ ఎప్పుడు తీసుకుంటే మంచిది? నిపుణులు ఏమంటున్నారంటే?

Pregnant Women Will Take Covid Vaccine

pregnant women will take covid vaccine  : గర్భవతులకు కరోనా వైరస్‌ సోకడం ద్వారా వారి గర్భంలోని ప్లాసెంటా అంటే మాయ మీద దుష్ప్రభావం చూపుతున్నట్లు 2020 మేలో ఓ అధ్యయనంలో తేలింది. అంటే కరోనా సోకిన వారిలో అంత్యంత ప్రమాదం కలిగినవారు గర్భిణులే. కానీ కరోనా ఫస్ట్ వేవ్..సెకంట్ వేవ్ అంటూ జనాలను పట్టిపీడిస్తున్న ఇటువంటి ప్రమాదకర స్థితిలో ఉన్న గర్భిణులకు కరోనా వ్యాక్సిన్‌ వేయాలా వద్దా అన్న విషయంలో అస్పష్టత కొనసాగుతున్న ఆందోళనకర పరిస్థితుల్లో గత ఏప్రిల్‌లో అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ అబ్స్‌టేట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీలో ఓ పరిశోధన ప్రచురితమైన కథనం ప్రకారం వ్యాక్సినేషన్‌ తర్వాత గర్భిణుల శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి చెందుతాయని, అవి గర్భంలోని శిశువుకు కూడా అందుతాయని తేలిపింది.

వ్యాక్సిన్‌ వేసుకోవడం వల్ల గర్భంలోని ప్లాసెంటాకు ఎలాంటి నష్టం లేదని, హాని జరుగుతుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఈ క్రమంలో గర్భిణులు, వ్యాక్సిన్‌ అపోహల విషయంలో నిపుణులు క్లారిటీ ఇచ్చారు. కరోనా ఫస్ట్‌వేవ్‌ సమయంలో పాజిటివ్‌ వచ్చి డెలివరీ అయిన మహిళలకు పుట్టిన పిల్లల్లో ఎటువంటి అవయవ లోపాలు కనిపించలేదు. పుట్టిన శిశువుల్లో యాం టీబాడీలు కూడా కనిపించటంలో వైద్య సిబ్బంది ఆనందం వ్యక్తంచేశారు.

యూకే, అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ ఇన్‌ఫెర్టిలిటీ, సీడీసీ, ఫాగ్సీ గైడ్‌లైన్స్‌ కూడా గర్భిణులకు వ్యాక్సిన్‌ ఇవ్వొచ్చని ఇప్పటికే స్పష్టం చేశాయి. అయితే భారత ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. గర్భం దాల్చిన తర్వాత 9 నెలల సమయంలో ఎప్పుడైనా వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు. పిండం అవయవాలు అభివృద్ధి చెందిన తర్వాత అంటే.. అంటే సుమారు 12 నుంచి 20 వారాల తర్వాత తీసుకుంటే మంచిదని చెబుతున్నారు నిపుణులు. అయినా పరిస్థితులను బట్టి వైరస్‌ ప్రభావం స్థాయిని బట్టి ఏ నెలలోనైనా తీసుకోవచ్చని చెబుతున్నారు.

వ్యాక్సిన్‌ తీసుకుంటున్న వారిలో కొందరికి జ్వరం, తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కానీ ఏమీ భయపడాల్సిన పనిలేదని చెబుతున్నారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తే సాధారణ వ్యక్తులకు ఇచ్చినట్లుగానే..గర్భిణులకు కూడా పారాసిటమాల్‌ టాబ్లెట్ ఇస్తే సరిపోతుంది. గర్భిణులు ఎక్కువగా నీరు ఎక్కువ తాగాలని సూచిస్తున్నారు. ఫ్లూ వ్యాక్సిన్‌తో పాటు ఇంకేది కలపకూడదని చెబతున్నారు.

తల్లీ బిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టు కుని గర్భం దాల్చిన తర్వాత సాధారణంగా తల్లికి ఫ్లూ వ్యాక్సిన్‌ ఇస్తుంటారు. కరోనా టీకా కూడా ఇవ్వాల్సి వస్తే..అలా ఒకేసారి ఈ రెండు టీకాలు ఇవ్వకూడదు. ఫ్లూ వ్యాక్సిన్‌ ఇవ్వడానికి..కోవిడ్‌ టీకా ఇవ్వడానికి మధ్య కనీసం 15 రోజుల సమయం ఉండాలని తెలిపారు. అలాగే ప్రసవం తర్వాత కూడా టీకా తీసుకోవచ్చని చెబుతున్నారు.