PM Modi Japan Visit: జపాన్‌లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.. బోధి వృక్షాన్ని అక్కడ నాటడంపై కీలక వ్యాఖ్యలు

హిరోషిమాలో మహాత్మాగాంధీ విగ్రహం అహింస ఆలోచనను ముందుకు తీసుకెళ్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.

PM Modi Japan Visit: జపాన్‌లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.. బోధి వృక్షాన్ని అక్కడ నాటడంపై కీలక వ్యాఖ్యలు

PM Modi

PM Narendra Modi: జపాన్‌లోని హిరోషిమాలో వార్షిక జీ-7 సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జపాన్ పర్యటనకు వెళ్లారు. శనివారం ఉదయం హిరోషిమాలోని మహాత్మాగాంధీ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అనంతరం మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోదీ ప్రపంచానికి శాంతి సందేశాన్ని కూడా అందించారు.

PM Modi US Visit: అమెరికా పర్యటనకు ప్రధాని మోదీ.. జూన్ 22న మోదీ కోసం స్టేట్‌ డిన్నర్‌

నేటికీ హిరోషిమా అనే పదం వింటేనే ప్రపంచం భయపడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జీ7 సదస్సు కోసం జపాన్ లో పర్యటించిన సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు లభించిందని, అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. హిరోషిమాలో మహాత్మాగాంధీ విగ్రహం అహింస ఆలోచనను ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు.

Narendra Modi: జపాన్‌లో ప్రవాస భారతీయులతో మాట్లాడిన మోదీ.. వీడియో

జపాన్ ప్రధానికి నేను బహుమతిగా ఇచ్చిన బోధి వృక్షాన్ని హీరోషిమాలో ఇక్కడ నాటారని నాకు తెలిసిందని, ఆ విషయం నాకు ఎంతో సంతాషాన్ని ఇచ్చిందని ప్రధాని అన్నారు. తద్వారా ప్రజలు ఇక్కడకు వచ్చినప్పుడు శాంతి యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు అని ప్రధాని పేర్కొన్నారు.