పాక్ పత్రికల్లో పిచ్చి రాతలు : పుల్వామా దాడి స్వాతంత్య్ర పోరాటమంట

పాక్ పత్రికల్లో పిచ్చి రాతలు : పుల్వామా దాడి స్వాతంత్య్ర పోరాటమంట

ప్రపంచ దేశాలన్నీ కశ్మీర్‌లో జరిగిన పుల్వామా దాడిపై భారత్‌కు మద్దతుగా నిలిస్తే.. పాక్ మీడియా మాత్రం వెనకేసుకొస్తుంది. ఆ దేశ మీడియా అదేదో ఘనకార్యం చేసినట్లుగా చిత్రీకరిస్తుంది. 49మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదిని స్వాతంత్ర్య సమరయోధుడంటూ డప్పు కొడుతోంది. ఓ వైపు ఈ ఘటనపై మాకెలాంటి సంబంధం లేదంటూ పాకిస్తాన్ అధికారికంగా చెప్పుకొస్తున్నా.. మీడియా మాత్రం నిజాలు బయటపెడుతూ ఉగ్రవాద చర్యలకు ఊతమిస్తోంది. 

పాకిస్తాన్‌లోని ‘ద నేషన్’ అనే న్యూస్ పేపర్ హెడ్డింగ్‌లో.. ‘IOK (ఇండియా ఆక్యూపైడ్ కశ్మీర్)లో స్వాతంత్య్ర సమరయోధులు జరిపిన దాడిలో 44 మంది జవాన్లు మృతిచెందారు’ అని పేర్కొంది. ‘ద ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ అనే న్యూస్‌పేపర్ పుల్వామా దాడి ఘటన వార్తలో కశ్మీర్‌ను ‘భారత ఆక్రమిత కశ్మీర్’ అని పేర్కొంది. మరికొన్ని పేపర్లు కూడా పాక్‌కు అనుకూలంగానే వార్తలు ప్రచురించాయి. కశ్మీరీల తిరుగుబాటు చర్యగా ఈ దాడిని చిత్రీకరించే ప్రయత్నం చేశాయి. 

ఫిబ్రవరి 14వ తేదీ గురువారం 2,547 సీఆర్పీఎఫ్ జవాన్లతో వెళ్తున్న కాన్వయ్‌పై జైషే మొహమ్మద్ అనే ఉగ్రవాది ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం పాక్‌కు గట్టి సమాధానమిస్తామంటూ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అమెరికా సైతం పాకిస్తాన్‌పై ఆంక్షలు జారీ చేసింది. ఉగ్రవాదులకు ఇస్తున్న మద్దతును ఉపసహకరించుకోవాలంటూ తేల్చి చెప్పేసింది. కానీ, పాక్ మీడియా మాత్రం ఇవేమీ పట్టనట్లు ప్రవర్తిస్తోంది. 

Read Also:  సాలే, ఇక్కడెందుకున్నావ్ రా? పాకిస్థాన్‌కి పో..

Read Also: ఆల్ పార్టీ – వ‌న్ వాయిస్ : పాక్ పై యుద్ధ‌మేనా