Ukraine War: యుద్ధాన్ని కొనసాగిస్తాం.. రష్యాను ఓడించడం అసాధ్యం: ఉక్రెయిన్ లో బైడెన్ పర్యటన వేళ పుతిన్

ఉక్రెయిన్ లో యుద్ధాన్ని కొనసాగిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిన్న ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో పర్యటించి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ కి ఆయుధ సాయం చేస్తామని కూడా భరోసా ఇచ్చారు. గత ఏడాది ఫిబ్రవరి 24న సైనిక చర్యను ప్రారంభిస్తున్నట్లు పుతిన్ ప్రకటించారు.

Ukraine War: యుద్ధాన్ని కొనసాగిస్తాం.. రష్యాను ఓడించడం అసాధ్యం: ఉక్రెయిన్ లో బైడెన్ పర్యటన వేళ పుతిన్

Putin says Russia wants end to war in Ukraine

Ukraine War: ఉక్రెయిన్ లో యుద్ధాన్ని కొనసాగిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిన్న ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో పర్యటించి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ కి ఆయుధ సాయం చేస్తామని కూడా భరోసా ఇచ్చారు. గత ఏడాది ఫిబ్రవరి 24న సైనిక చర్యను ప్రారంభిస్తున్నట్లు పుతిన్ ప్రకటించారు.

ఉక్రెయిన్ లో యుద్ధం ప్రారంభమై మరో మూడు రోజుల్లో సంవత్సరం అవుతుంది. దీంతో ఇవాళ పుతిన్ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. అమెరికా నేతృత్వంలోని నాటో అగ్నికి ఆజ్యం పోసేలా వ్యవహరిస్తోందని, రష్యా ఓడిపోతుందన్న తప్పుడు భావనతో ఉందని చెప్పారు. యుద్ధాన్ని నివారించాలని అన్ని ప్రయత్నాలు చేశామని, అయితే, పశ్చిమ దేశాల మద్దతుతో క్రిమియాపై ఉక్రెయిన్ దాడి చేయడానికి ప్రణాళికలు వేసుకుందని అన్నారు.

ఉక్రెయిన్ ప్రజలు వారి సొంత ప్రాంతం కీవ్ లోనే బందీలుగా మారారని చెప్పారు. ఉక్రెయిన్ ను పశ్చిమ దేశాలు రాజకీయంగా, మిలటరీ పరంగా, ఆర్థిక పరంగా ఆక్రమించుకున్నాయని అన్నారు. రష్యాను ఓడించడం అసాధ్యమని చెప్పారు. తాము పద్ధతి ప్రకారం తమ లక్ష్యాలను సాధించుకుంటూ వెళ్తామని తెలిపారు.

ఉక్రెయిన్ లో నెలకొన్న పరిణామాలకు పశ్చిమ దేశాలదే పూర్తి బాధ్యత అని చెప్పారు. కాగా, నిన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని బైడెన్ కలిశారు. ఉక్రెయిన్ తన ప్రాంతీయ సమగ్రతను కాపాడుకునేందుకు తాము సాయం అందిస్తామని, మరిన్ని ఆయుధాలు ఇస్తామని బైడెన్ ప్రకటించారు.

Turkey Earthquake: టర్కీలో ఆగని భూ ప్రకంపనలు.. భయం గుప్పిట్లో ప్రజలు