Lionel Messi : లియోనల్ మెస్సీ వరల్డ్ గ్రేటెస్ట్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఎదిగిన వెనుకున్న కారణాలు..

మెస్సీ.. ఈ భూమిపై ఉన్న అల్టిమేట్ ఫుట్ ప్లేయర్. అతని టాలెంట్.. నెక్ట్స్ లెవెల్. ఇది.. ఏ ఫుట్ బాల్ ప్లేయర్‌ని అడిగినా, గేమ్ లవర్‌ని అడిగినా చెప్పేస్తారు. అయితే.. మెస్సీ లాంటి లెజెండరీ ప్లేయర్ కెరీర్‌లో ఒక్క ఫిఫా టైటిల్ కూడా లేకపోవడం కచ్చితంగా లోటే. కానీ.. ఫుట్‌బాల్ గేమ్‌పై అతని ఆట తీరు చూపిన ఇంపాక్ట్ అస్సలు తగ్గదు. ఈసారి.. మెస్సీ.. వరల్డ్ గ్రేటెస్ట్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఎదగటానికి కొన్ని మేజర్ రీజన్స్ ఉన్నాయ్. అవే.. అతన్ని ఈ స్థాయిలో నిలిబెట్టాయి. అవేంటో ప్రతీ క్రీడా అభిమాని తెలుసుకోవాల్సిన కీలక విషయాలు.

Lionel Messi : లియోనల్  మెస్సీ వరల్డ్ గ్రేటెస్ట్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఎదిగిన వెనుకున్న కారణాలు..

Lionel Messi Retirement

Lionel Messi : మెస్సీ.. ఈ భూమిపై ఉన్న అల్టిమేట్ ఫుట్ ప్లేయర్. అతని టాలెంట్.. నెక్ట్స్ లెవెల్. ఇది.. ఏ ఫుట్ బాల్ ప్లేయర్‌ని అడిగినా, గేమ్ లవర్‌ని అడిగినా చెప్పేస్తారు. అయితే.. మెస్సీ లాంటి లెజెండరీ ప్లేయర్ కెరీర్‌లో ఒక్క ఫిఫా టైటిల్ కూడా లేకపోవడం కచ్చితంగా లోటే. కానీ.. ఫుట్‌బాల్ గేమ్‌పై అతని ఆట తీరు చూపిన ఇంపాక్ట్ అస్సలు తగ్గదు. ఈసారి.. మెస్సీ తన కెరీర్‌ని ఫిఫా వరల్డ్ కప్ టైటిల్‌తోనే ముగించే చాన్స్ కనిపిస్తోంది. అలాగే.. మెస్సీ.. వరల్డ్ గ్రేటెస్ట్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఎదగటానికి కొన్ని మేజర్ రీజన్స్ ఉన్నాయ్. అవే.. అతన్ని ఈ స్థాయిలో నిలిబెట్టాయి. అవేంటో ప్రతీ క్రీడా అభిమాని తెలుసుకోవాల్సిన కీలక విషయాలు అనటంలో ఎటువంటి సందేహం లేదు.

ఈ తరం ఫుట్ బాల్ ప్లేయర్లలో.. ఎంతో మంది దిగ్గజ ఆటగాళ్లున్నారు. అందులో.. లియోనల్ మెస్సీ ఒకడు. ఫుట్‌బాల్‌ గేమ్‌లో.. అతను స్టార్ ప్లేయర్‌గా ఎదగడమే కాదు.. లెజెండ్‌గా మారడానికి కొన్ని కారణాలున్నాయ్. అందులో మొట్టమొదటిది.. ఇంటలిజెన్స్. మెస్సీలో ఉన్న ఇతర లక్షణాల కంటే.. గేమ్‌లో ఉన్నప్పుడు అతని తెలివిగా వ్యవహరించే విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రత్యర్థి ఆటగాళ్ల మూవ్స్‌ని ముందే గ్రహించి.. అందుకు తగ్గట్లుగా తన గేమ్‌ని, స్ట్రాటజీని మార్చి.. గోల్స్ చేయడంలో మెస్సీకి మరెవరూ సాటి లేరు. గోల్ కీపర్ వైపు దూసుకెళ్తున్నప్పుడు.. మెస్సీ పాసింగ్, షూటింగ్, డెసిషన్ మేకింగ్ చాలా వేగంగా ఉంటాయ్. మెస్సీ కాన్సట్రేట్ చేసి గోల్ కొడితే.. కచ్చితంగా నెట్‌లోని ఏదో ఒక మూలకు.. కూల్‌గా బాల్ తగలాల్సిందే.

గేమ్ విషయంలో మెస్సీ విజన్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. కేవలం గోల్స్ కొట్టడమే కాదు.. తన టీమ్ మేట్స్ చేసే ఇంపాజిబుల్ పాస్‌లను కూడా గోల్ స్కోరింగ్ కోసం వాడేస్తాడు. అతను చేసే పాస్‌లతో.. మిగతా ప్లేయర్లు గోల్స్ కొట్టిన సందర్భాలెన్నో ఉన్నాయ్. ఈ.. లక్షణమే.. మెస్సీని మిగతా ఏ ఆటగాడితో పోల్చకుండా చేస్తోంది. మెస్సీ స్కోరింగ్ రికార్డులను బద్దలు కొట్టడమే కాదు.. ఫార్వార్డ్‌లు అందించడంలోనూ మేటి ప్లేయర్. అర్జెంటీనా టీమ్‌ వెనకున్న అద్భుతమైన విజన్, కాంబినేషన్ మెస్సీ అని చెప్పడంలో ఏమాత్రం ఎగ్జాగిరేషన్ లేదు.

Lionel Messi Retirement : ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాత మెస్సీ రిటైర్మెంట్..! తీవ్ర నిరాశలో ఫుట్‌బాల్ ఫ్యాన్స్..!!

మెస్సీ వేగం లాగే.. అతని చురుకుదనం కూడా డిఫెండర్లను దూసుకొని వెళ్లిపోతుంది. బాల్‌ మీద అతనికున్న కంట్రోల్ మామూలుది కాదు. ప్రత్యర్థి ఆటగాళ్లను కన్ఫ్యూజ్ చేయడంలో.. మెస్సీని మించిన ప్లేయర్ మరొకరు లేరు. ఒక్కసారి మెస్సీ దాకా వెళితే.. దాన్ని గోల్ పోస్ట్ దాకా తీసుకెళ్లేదాకా అతను తగ్గడు. అతని నుంచి బాల్‌ని వేరు చేసేందుకు అవతలి టీమ్ ప్లేయర్లు కిందా మీదా పడినా.. సక్సెస్ అవడం చాలా కష్టం. సెకన్లలోనే.. మెస్సీ బాల్ డైరెక్షన్‌ని మార్చేయగలడు. డిఫెండర్ల నుంచి తప్పించుకునేందుకు మెస్సీ చేసే లాస్ట్ సెకండ్ కట్స్.. అతని గేమ్‌కి మరో హైలైట్.

గ్రౌండ్‌లో మెస్సీ పోరాటం కూడా అద్భుతంగా కనిపిస్తుంది. ఆట కోసం ప్రాణం పెట్టేస్తాడు. ప్రత్యర్థి చిన్న టీమ్ అయినా.. పెద్ద టీమ్ అయినా.. మెస్సీ ఆట తీరు ఒకేలా ఉంటుంది. చూసేందుకు పొట్టిగా కనిపించినా.. గేమ్ మాత్రం చాలా గట్టిగా, కసిగా ఆడతాడు. ఆ కమిట్మెంటే.. మెస్సీకి ఈ స్థాయి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఫుట్‌బాల్ అంటే అతనికెంత ప్రేమో.. గ్రౌండ్‌లో దాంతో అతను ఆడుకునే తీరు చూస్తే తెలిసిపోతుంది. అతని కాలికి ఒక్కసారి బాల్ చిక్కితే.. అది అంత ఈజీగా మరో ప్లేయర్ దగ్గరికి చేరదు. కొన్నిసార్లు గ్రౌండ్‌లో మెస్సీ సూపర్ ఫాస్ట్ ప్లేయర్‌గా కనిపించకపోవచ్చు. క్రిస్టియానో రొనాల్డో లాంటి ప్లేయర్లతో పోల్చినప్పుడు.. మెస్సీ కాస్త స్లోగానే కనిపిస్తాడు. అయినా.. గోల్స్ కొట్టడంలో మెస్సీకి మెస్సీనే సాటి. ఫుట్‌బాల్ ప్లేయర్లు ఎవరైనా గోల్ కొడతారు. కానీ.. మెస్సీ కొట్టే గోల్.. నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుంది.

FIFA World Cup 2022: అర్జెంటీనాలో అంబరాన్ని తాకిన ఫ్యాన్స్ సంబురాలు.. రోడ్లపైకొచ్చి గంతులేశారు.. వీడియోలు వైరల్

ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో.. అర్జెంటీనా వరల్డ్‌కప్ టైటిల్ గెలవకపోయినా.. మెస్సీ లెగసీకి, అతని క్రేజ్‌కు, అతనిపై ఉన్న అభిమానానికి, ప్రేమకు వచ్చిన ఢోకా ఏమీ లేదు. ఫుట్‌బాల్ గేమ్‌పై అతని ఆట తీరు చూపిన ఇంపాక్ట్ అస్సలు తగ్గదు. చాలా మంది గొప్ప ఆటగాళ్లు.. తమ కెరీర్‌లో వరల్డ్ కప్ గెలవలేకపోయారు. మెస్సీ కూడా ఆ క్లబ్‌లో చేరొచ్చు. కానీ.. అతని ఆటను, అతని గొప్పతనాన్ని.. వరల్డ్ కప్ టోర్నీతో పోల్చి చూడలేం. కానీ.. ఈసారి అతని సారథ్యంలోని అర్జెంటీనా వరల్డ్‌కప్ టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయ్. అదే జరిగితే.. మెస్సీ లెజెండరీ హోదా మరింత పెరుగుతుంది. ఆ కీర్తిని సాధించేందుకు.. అతను ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. అతను.. ఫిఫా టైటిల్ గెలిచినా, గెలవకపోయినా.. మెస్సీ ఆటకు అదేమీ మాయని మచ్చగా మారదు.