కరోనా వైద్యం కోసం రూ. 38కోట్ల విరాళం ఇచ్చిన సింగర్

  • Published By: vamsi ,Published On : March 21, 2020 / 09:42 PM IST
కరోనా వైద్యం కోసం రూ. 38కోట్ల విరాళం ఇచ్చిన సింగర్

ప్రముఖ పాప్ సింగర్ రిహన్న అందాల ఆరబోతలో తనకు తానే సాటి. టాప్‌లెస్ స్టిల్స్‌తో ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉండే ఈ అమ్మడు.. తన అందాలతో అభిమానుల మతులు పోగొడుతోంది. నగ్నంగా ఫోజులిస్తూ ప్రపంచవ్యాప్తంగా పబ్లీసిటీ తెచ్చుకున్న ఈ అమ్మడు లేటెస్ట్‌గా అందమైనా మనస్సుతో మంచిపని చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ సహాయక చర్యలకు రిహన్న పెద్ద ఎత్తున సహాయం అందించింది. క్లారా లియోనెల్ ఫౌండేషన్ తరపున యునైటెడ్ స్టేట్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా COVID-19పై పోరాటం చేసేందుకు వివిధ దేశాలకు 5మిలియన్ డాలర్లు(దాదాపు 38కోట్లు) విరాళంగా ఇచ్చినట్లు ప్రకటించింది. ఈ డబ్బు స్థానిక ఆహార బ్యాంకులకు మరియు యునైటెడ్ స్టేట్స్‌లోని వృద్ధులకు సేవలు అందించేందుకు ఉపయోగపడాలని ఆమె కోరింది. 

హైతీ, మాలావి వంటి దేశాలలో కరోనావైరస్ పరీక్షలకు సంరక్షణ వేగవంతం చేయడానికి, వనరులు సరిగ్గా లేవని అందుకోసం కొంత డబ్బు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. డయాగ్నొస్టిక్ ల్యాబ్‌ల కోసం, రక్షించే పరికరాల కొనుగోలుకి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లను స్థాపించడానికి మరియు నిర్వహించడానికి, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లు మరియు ఇతర చికిత్సల అభివృద్ధిని వేగవంతం చేయడానికి, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడానికి మరియు క్లిష్టమైన శ్వాసకోశ సామాగ్రిని పంపిణీ చేయడానికి ఈ నిధులు ఉపయోగించబడతాయి.

అట్టడుగు, తక్కువ వర్గాలను రక్షించడానికి చికిత్స చేయించుకోవడానికి డబ్బు లేనివారికి సహాయంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు క్లారా లియోనెల్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జస్టిన్ లూకాస్ ఒక ప్రకటనలో తెలిపారు. రిహన్న తన కుటుంబ సభ్యుల గౌరవార్థం 2012లో క్లారా లియోనెల్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసింది. 

ఈ ఫౌండేషన్ ప్రపంచవ్యాప్తంగా విద్య, వైద్యానికి సంబంధించిన కార్యక్రమాలకు మద్దతు ఇస్తుంది. నిధులు సమకూరుస్తుంది.