New UK PM: ‘బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి పోటీ రేసులో నిలుస్తున్నాను’ అంటూ భారత సంత‌తి నేత రిషి సునక్ ప్రకటన

బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి పోటీ రేసులో తాను కూడా నిలుస్తున్నట్లు ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంత‌తి నేత రిషి సునక్ అధికారిక ప్రకటన చేశారు. కొన్ని నెలల క్రితం బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి నుంచి బోరిస్‌ జాన్సన్‌ వైదొలగుతున్న నేపథ్యంలో ఆ ప‌ద‌వికి రిషి సునక్ పోటీ చేస్తూ తుది రేసులో నిలిచిన విష‌యం తెలిసిందే. అయితే, చివరకు లిజ్‌ ట్రస్ చేతిలో రిషి సునక్ ఓడిపోయారు. బ్రిటన్ లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. ఇప్పుడు మళ్ళీ బ్రిటన్ ప్రధానిగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారన్న ఉత్కంఠ నెలకొంది.

New UK PM: ‘బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి పోటీ రేసులో నిలుస్తున్నాను’ అంటూ భారత సంత‌తి నేత రిషి సునక్ ప్రకటన

Rishi Sunak

Rishi Sunak: బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి పోటీ రేసులో తాను కూడా నిలుస్తున్నట్లు ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంత‌తి నేత రిషి సునక్ అధికారిక ప్రకటన చేశారు. కొన్ని నెలల క్రితం బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి నుంచి బోరిస్‌ జాన్సన్‌ వైదొలగుతున్న నేపథ్యంలో ఆ ప‌ద‌వికి రిషి సునక్ పోటీ చేస్తూ తుది రేసులో నిలిచిన విష‌యం తెలిసిందే. అయితే, చివరకు లిజ్‌ ట్రస్ చేతిలో రిషి సునక్ ఓడిపోయారు. బ్రిటన్ లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. ఇప్పుడు మళ్ళీ బ్రిటన్ ప్రధానిగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారన్న ఉత్కంఠ నెలకొంది.

రిషి సునక్ మళ్ళీ అభ్యర్థిగా నిలుస్తారన్న ప్రచారం జరిగింది. ఈ విషయంపైనే ఆయన స్పష్టత ఇచ్చారు. కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వం కోసం జరిగే ఎన్నికల్లో అభ్యర్థిగా నిలుస్తానని, దేశ ఆర్థిక వ్యవస్థను బాగు చేస్తానని రిషి సునక్ అన్నారు. ఆయనకు ఇప్పటికే 100కు పైగా ఎంపీల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది.

‘‘దేశ ఆర్థిక వ్యవస్థను బాగుచేయాలనుకుంటున్నాను. పార్టీని ఏకతాటిపైకి తీసుకువస్తాను. దేశాభివృద్ధి కోసం పాటుపడతాను’’ అని రిషి సునక్ చెప్పారు. యూకే గొప్ప దేశమని, అయితే, ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని అన్నారు. అందుకే తాను కన్జర్వేటివ్ పార్టీ తదుపరి నాయకుడిగా, ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్నానని చెప్పారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..