OTT Platforms: ఓటీటీలపై కొరడా ఝుళిపించనున్న బ్రిటన్.. రూల్స్ అతిక్రమిస్తే రూ2.5 కోట్ల జరిమానా

త్వరలో ఓటీటీలకు జరిమానా విధించే కొత్త చట్టం తీసుకురానుంది బ్రిటన్. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నారు. కొత్త చట్టం అమల్లోకి వస్తే ఓటీటీలకు బ్యాండ్ పడటం ఖాయం. బ్రిటన్ ఉన్నట్లుండి ఈ చట్టం రూపొందించడానికి ఒక కారణం ఉంది.

OTT Platforms: ఓటీటీలపై కొరడా ఝుళిపించనున్న బ్రిటన్.. రూల్స్ అతిక్రమిస్తే రూ2.5 కోట్ల జరిమానా

OTT Platforms: విచ్చలవిడి కంటెంట్‌తో రెచ్చిపోతున్న ఓటీటీలకు కళ్లెం వేసేందుకు సిద్ధమవుతోంది బ్రిటన్. త్వరలో ఓటీటీలకు జరిమానా విధించే కొత్త చట్టం తీసుకురానుంది. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నారు. బ్రిటన్‌లో ప్రసార సాధనాలను పర్యవేక్షించే ఆఫీస్ ఆఫ్ కమ్యూనికేషన్స్ (ఆఫ్‌కామ్)కు ఈ చట్టం ద్వారా ఓటీటీలపై చర్యలు తీసుకునే అధికారం కట్టబెట్టనున్నారు.

Millet Only Lunch: పార్లమెంట్‪లో మంగళవారం ‘మిల్లెట్ ఓన్లీ లంచ్’ ఏర్పాటు చేసిన కేంద్రం.. హాజరుకానున్న మోదీ

కొత్త చట్టం అమల్లోకి వస్తే ఓటీటీలకు బ్యాండ్ పడటం ఖాయం. బ్రిటన్ ఉన్నట్లుండి ఈ చట్టం రూపొందించడానికి ఒక కారణం ఉంది. ఇటీవల బ్రిటన్ రాజ వంశీకుడైన ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ గురించి నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన ఒక డాక్యుమెంటరీ వివాదాస్పదంగా ఉంది. దీనిపై బ్రిటన్ రాజు సహా అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇలాంటి ఓటీటీలను ఇకపై చట్టం పరిధిలోకి తేవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధించాలని భావిస్తోంది బ్రిటన్. దీని ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే గరిష్టంగా 2,50,000 పౌండ్లు.. అంటే రూ.2.5 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

కొత్త చట్టం ప్రకారం అభ్యంతరకర కంటెంట్ గురించి వినియోగదారులు, వీక్షకులు కూడా ఫిర్యాదు చేయొచ్చు. ఈ ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకుంటారు. దీనిప్రకారం ఇకపై నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్ స్టార్, హెచ్‌బీవో వంటివన్నీ ‘ఆఫ్‌కామ్’ పర్యవేక్షణలోకి వస్తాయి.