బుల్లి ప్రిన్స్ పేరు ఇదే

  • Published By: venkaiahnaidu ,Published On : May 9, 2019 / 02:28 AM IST
బుల్లి ప్రిన్స్ పేరు ఇదే

బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ హ్యారీ,  మేఘన్‌ మార్కెల్‌ దంపతులకు జన్మించిన మగబిడ్డ ఫొటోను చూసేందుకు మూడు రోజుల నుంచి ఈ రాజదంపతులు హితులు, సన్నిహితులతోపాటు  ప్రపంచవ్యాప్తంగా పలువురు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.అయితే అందరూ ఎదురుచూస్తున్న రాయల్‌ బేబీ ఫోటోలు  వచ్చేసాయి. స్వయంగా  బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ హ్యారీ,  మేఘన్‌ మార్కెల్‌ దంపతులు తమ  తొలి సంతానాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి.

సోమవారం(మే-6,2019) ఉదయం 05:26 గంటలకు (స్థానిక సమయం) మేఘన్ మార్కెల్ మగబిడ్డకు జన్మనిచ్చింది. మగబిడ్డకు జన్మనిచ్చిన రెండు రోజుల  తరువాత బుధవారం(మే-8,2019) ఉదయం హ్యారీ, మేఘన్‌  విండ్సోర్ కాసిల్ లోని సెయింట్ జార్జ్ హాల్ లో తొలిసారి మీడియాతో మాట్లాడారు. అద్భుతంగా  ఉంది.

ఈ ప్రపంచంలో ఇద్దరు  బెస్ట్‌ గైస్‌ నా జీవితంలోకి వచ్చారు అంటూ మేఘన్‌ తన సంతోషాన్ని వెలిబుచ్చారు.తమ కుమారుడి పేరు…ఆర్చి హారిసన్ మౌంట్ బాటన్ విండ్సర్ అని ఇన్ స్టాగ్రామ్ ద్వారా రాయల్ దంపతులు ప్రకటించారు.ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు,ప్రముఖులు హ్యారీ దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.