Russia ukraine war : అదను చూసి విరుచుకుపడ్డ యుక్రెయిన్ సేన, 300 మంది రష్యా సైనికుల ప్రాణాలు తీసిన ఒకే ఒక్క ఫోన్..

భయంకరమైన క్షిపణులతో విరుచుకుపడుతు యుక్రెయిన్ ను శ్మశానంగా మార్చేస్తున్న రష్యాకు యుక్రెయిన్ మర్చిపోలేని న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. రష్యా సైనికులు అత్యంత రహస్య ప్రదేశంలో ఉన్నా యుక్రెయిన్ పసిగట్టింది.అంతే వారు ఫోన్ లో మునిగి ఉన్న సమయంలో ఒక్కసారిగా విరుచుపడ్డాయి యుక్రెయిన్ క్షిపణులు..అంతే ఏం జరుగుతుందో అర్థం అయ్యేలోపే వందలాదిమంది రష్యా సైనికులు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఊహించని ఈ ఘటనకు కారణం ఒక్క ఫోన్..ఒకే ఒక్క ఫోన్..

Russia ukraine war : అదను చూసి విరుచుకుపడ్డ యుక్రెయిన్ సేన, 300 మంది రష్యా సైనికుల ప్రాణాలు తీసిన ఒకే ఒక్క ఫోన్..

Russia ukraine war : భయంకరమైన క్షిపణులతో విరుచుకుపడుతు యుక్రెయిన్ ను శ్మశానంగా మార్చేస్తున్న రష్యాకు యుక్రెయిన్ మర్చిపోలేని న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. రష్యా సైనికులు అత్యంత రహస్య ప్రదేశంలో ఉన్నా యుక్రెయిన్ పసిగట్టింది.అంతే వారు ఫోన్ లో మునిగి ఉన్న సమయంలో ఒక్కసారిగా విరుచుపడ్డాయి యుక్రెయిన్ క్షిపణులు..అంతే ఏం జరుగుతుందో అర్థం అయ్యేలోపే వందలాదిమంది రష్యా సైనికులు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. శరీరాలు తునాతునకలైపోయాయి. ఊహించని ఈ ఘటనకు కారణం ఒక్క ఫోన్..ఒకే ఒక్క ఫోన్..అవును నిజమే..

ఒకే ఒక్క ఫోన్… 300మంది ప్రాణాలు తీసింది. అవును నిజమే… ఆ ఒక్క ఫోన్ కారణంగా 300 మందికి పైగా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ప్రాణాలతో పోరాడుతున్నారు. రష్యా, యుక్రెయిన్‌ యుద్ధంలో జరిగిన దారుణం ఇది. ఇటీవల డోన్‌టెస్క్‌లో రష్యా సైనికులు ఉంటున్న కాలేజీపై యుక్రెయిన్‌ రాకెట్లతో మెరుపు దాడి చేసింది. సరిగ్గా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి సెకండ్‌లోనే ఈ దాడి జరిగింది. రష్యా సైనికులు న్యూఇయర్‌ జోష్‌లో ఉండగా… రాకెట్ల వర్షం కురిసింది. ఏం జరిగిందో అర్థమయ్యేలోగానే 300 మందికిపైగా చనిపోయారు.

అత్యంత రహస్య ప్రదేశంలో రష్యా సైనికులు తలదాచుకున్నారు. వారి వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. అలాంటిది ఆ సమాచారం యుక్రెయిన్‌కు ఎలా లీకైందన్నది రష్యాకు అర్థంకాలేదు. దీనిపై జరిగిన విచారణలో వెల్లడైన నిజం రష్యాకు మైండ్‌ బ్లాంక్‌ చేసింది. బ్యాన్‌ చేసిన ఫోన్ వాడకం కొంపముంచిందని విచారణలో తేలింది. భద్రతా కారణాలతో రష్యా తన సైనికులు వాడే ఫోన్లపై ఆంక్షలు విధించింది. కొన్ని రకాల ఫోన్లను అసలు వినియోగించొద్దని హెచ్చరించింది. అయితే దాన్ని పట్టించుకోకుండా కొందరు నిషేధించిన ఫోన్లను ఉపయోగించారు. దీన్ని గుర్తించిన యుక్రెయిన్… వాటిని ట్రాక్‌చేసింది. వాటిలోకి స్పైవేర్‌ ప్రవేశపెట్టడం ద్వారా అక్కడి మాటలను విన్నట్లు రష్యా అనుమానిస్తోంది.

న్యూఇయర్‌ సందర్భంగా రష్యా సైనికులు తమ కుటుంబాలతో మాట్లాడతారని ఊహించిన యుక్రెయిన్‌ దానికోసం రెడీగా ఉంది. కరెక్టుగా కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టే క్షణంలో రష్యా సైనికులు తమ కుటుంబంతో మాట్లాడేందుకు ఫోన్లు ఆన్‌ చేశారు. దాన్ని గుర్తించిన యుక్రెయిన్‌ వెంటనే వారున్న లొకేషన్‌ను ఖచ్చితంగా గుర్తించింది. అమెరికా తయారీ హిమార్స్‌ రాకెట్లను ప్రయోగించింది. టార్గెట్‌ను చేధించడంలో తిరుగులేని హిమార్స్‌ రాకెట్లు మిగిలిన పనిని పూర్తి చేశాయి. అమెరికా వంటి దేశాల నుంచి కూడా నిఘా సమాచారం అంది ఉండొచ్చన్న అనుమానాలు కూడా ఉన్నప్పటికీ ప్రధాన కారణం మాత్రం ఆ ఫోన్లే కావొచ్చని రష్యా గట్టిగా నమ్ముతోంది. నిజానికి శత్రువుల ఆయుధాల పరిధిలో ఉన్నప్పుడు ఏ ఫోన్‌ కూడా వాడకూడదన్న నియమం ఉంది. అయితే చాలాకాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్న సైనికులు దాన్ని పట్టించుకోలేదు. దాని ఫలితమే ఈ స్థాయి నష్టం.

ఈ దాడిలో 300 మందికిపైగా రష్యా సైనికులు చనిపోయినట్లు యుక్రెయిన్ చెబుతోంది. అయితే రష్యా మాత్రం కేవలం 89మంది మాత్రమే చనిపోయినట్లు ప్రకటించింది. రష్యా ఇటీవల సైనిక సమీకరణ చేపట్టింది. రష్యా చట్టాల ప్రకారం 18నుంచి 27ఏళ్ల మధ్య ఉన్నవారు కనీసం ఒక్క ఏడాదైనా సైన్యంలో పనిచేయాల్సి ఉంటుంది. పైగా యుక్రెయిన్ యుద్ధం తర్వాత పెద్ద సంఖ్యలో యువకులను సైన్యంలోకి బలవంతంగా చేర్చుకుంది. వారిలో చాలామంది డోన్‌టెస్క్‌లో దాడి జరిగిన కాలేజీ ప్రాంగణంలో ఉన్నారు. వారితో పాటు భారీగా ఆయుధాలు కూడా అక్కడ ఉన్నాయి. యుక్రెయిన్‌ రాకెట్ల దెబ్బకు ఇప్పుడు ఆ ప్రాంతమంతా శిథిలాల దిబ్బగా మారిపోయింది. ఈ ఘటనపై రష్యా రాజకీయనాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువేనని రష్యా రాజకీయ నేతలు అనుమానిస్తున్నా… దానిపై గట్టిగా నిలదీయలేని పరిస్థితి ఉంది.