Russian vs Ukraine war: రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో పాస్ పోర్టుల జారీ.. యుక్రెయిన్ ప్రెసిడెంట్ ఏం చేశారంటే..

యుక్రెయిన్ పై రష్యా సైన్యం దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ దేశంలోని ఒక్కో ప్రాంతాన్ని రష్యాసైన్యం ఆక్రమించుకుంటూ వస్తోంది.. యుక్రెయిన్ లోని డాన్ బాస్ ప్రాంతంలో పారిశ్రామిక నగరమైన సివీరోదొనెట్స్ పై రష్యా దాడులు తీవ్రమయ్యాయి. ఈ

Russian vs Ukraine war: రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో పాస్ పోర్టుల జారీ.. యుక్రెయిన్ ప్రెసిడెంట్ ఏం చేశారంటే..

Russia

Russian vs Ukraine war: యుక్రెయిన్ పై రష్యా సైన్యం దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ దేశంలోని ఒక్కో ప్రాంతాన్ని రష్యాసైన్యం ఆక్రమించుకుంటూ వస్తోంది.. యుక్రెయిన్ లోని డాన్ బాస్ ప్రాంతంలో పారిశ్రామిక నగరమైన సివీరోదొనెట్స్ పై రష్యా దాడులు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో ఆ ప్రాంతంలోని అజోట్ కమికల్ ప్లాంట్ పై భారీగా షెల్లింగ్ చేశారు. దీంతో అక్కడి రేడియేటర్లలో టన్నుల కొద్దీ చమురు లీకవుతోంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానిక టీవీల్లో పేర్కొన్నారు.

Russia-Ukraine war: అత్యంత‌ ప్ర‌మాద‌క‌ర ఆయుధాల‌ను వాడుతున్న ర‌ష్యా!

మరోవైపు యుక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకున్న ఖెర్సాన్, మెలిటోపాల్ లలో ప్రజలకు రష్యా పాస్ పోర్టులను జారీచేస్తోంది. ఇప్పటికే కొంత మందిచేతికి వీటిని అందజేసింది. ఈ పరిణామాలను యుక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఆ దేశ ప్రెసిడెంట్ రష్యా తీరును తప్పుబట్టారు. ఆక్రమిత ప్రాంతాల్లో రష్యా ప్రజలను సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇదిలాఉంటే ఇటీవల 23 మంది ఖెర్సాన్ వాసులకు పాస్ పోర్ట్ లకు దరఖాస్తు చేసుకొన్నట్లు వెల్లడించింది. రష్యా ఇక్కడ మిలటరీ గవర్నర్ గా వొలొద్ మిర్ సాల్డోను నియమించింది.

Russia: ఉక్రెయిన్‌లోని ఖెర్సాన్‌లో బ్యాంకులు ప్రారంభిస్తోన్న ర‌ష్యా

ఇటీవల సాల్డో మాట్లాడుతూ.. ఖెర్సాన్ ప్రజలు రష్యా పౌరసత్వం కావాలని కోరుకుంటున్నారని అన్నారు. అయితే గతంలోనూ రష్యా ఆక్రమించుకున్న క్రిమియా, డాన్ బాస్ ప్రాంతాల్లో ఇదే విధంగా పౌరసత్వాన్ని జారీచేసింది. తాజాగా రష్యా ఇప్పుడు కూడా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తోందని యుక్రెయిన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒక్కసారి ఇక్కడి వారికి రష్యా పౌరసత్వం జారీచేస్తే ఇక వీరి రక్షణ బాధ్యత క్రెమ్లిన్ కు దక్కుతుంది. అప్పుడు తిరిగి ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం చాలా కష్టం.