Russia-Ukraine war: అత్యంత‌ ప్ర‌మాద‌క‌ర ఆయుధాల‌ను వాడుతున్న ర‌ష్యా!

తూర్పు ఉక్రెయిన్‌లో భీక‌ర పోరు కొన‌సాగిస్తోన్న ర‌ష్యా అత్యంత‌ ప్ర‌మాద‌క‌ర ఆయుధాల‌ను వాడుతున్న‌ట్లు తెలుస్తోంద‌ని బ్రిటిష్, ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. ఉక్రెయిన్‌లో ర‌ష్యా యుద్ధ విమానాలు 1960 నాటి నౌక‌ల విధ్వంస‌క‌ క్షిప‌ణులతో దాడులు చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

Russia-Ukraine war: అత్యంత‌ ప్ర‌మాద‌క‌ర ఆయుధాల‌ను వాడుతున్న ర‌ష్యా!

Missile Russia

Russia-Ukraine war: తూర్పు ఉక్రెయిన్‌లో భీక‌ర పోరు కొన‌సాగిస్తోన్న ర‌ష్యా అత్యంత‌ ప్ర‌మాద‌క‌ర ఆయుధాల‌ను వాడుతున్న‌ట్లు తెలుస్తోంద‌ని బ్రిటిష్, ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. ఉక్రెయిన్‌లో ర‌ష్యా యుద్ధ విమానాలు 1960 నాటి నౌక‌ల విధ్వంస‌క‌ క్షిప‌ణులతో దాడులు చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. విమానాల వాహ‌క నౌక‌లను అణ్వ‌స్త్రాల‌తో ధ్వంసం చేసేందుకు కేహెచ్‌-22 క్షిప‌ణుల‌ను అప్ప‌ట్లో ర‌ష్యా అభివృద్ధి చేసుకుంది. అత్యంత క‌చ్చిత‌త్వంతో ఇవి దాడులు చేస్తాయి. భారీగా విధ్వంసం జ‌రుగుతుంది. ఇప్పుడు ఇవే క్షిప‌ణుల‌ను భూత‌లంపై ల‌క్ష్యాల‌ను ఛేదించేందుకు ర‌ష్యా వాడుతున్న‌ట్లు తెలుస్తోంది.

prophet row: రాంచీలో హింస‌.. ఇద్ద‌రి మృతి.. ముగ్గురి ప‌రిస్థితి విష‌మం

డాన్‌బాస్ ప్రాంతం తూర్పు ఉక్రెయిన్‌లో ఉంటుంది. ఇక్క‌డ బొగ్గుగ‌నులు, ఫ్యాక్ట‌రీలు అధికంగా ఉంటాయి. దీంతో ఈ ప్రాంతాన్ని ర‌క్షించుకోవ‌డానికి ఉక్రెయిన్ అన్ని విధాలా ప్ర‌య‌త్నిస్తోంది. దీంతో ఉక్రెయిన్ కూడా పెద్ద ఎత్తున ఆయుధాల‌ను వాడుతూ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు క‌దులుతోంది. చాలా రోజులుగా యుద్ధం చేస్తోన్న కార‌ణంగా ల‌క్ష్యాల‌ను క‌చ్చితంగా ఛేదించ‌గ‌లిగే అత్యాధునిక‌ ఆయుధాలు ర‌ష్యా వ‌ద్ద త‌గ్గిపోయాయి. మరింత దూకుడుగా పోరాడితే త్వరలోనే ఆ ప్రాంతాన్ని రష్యా స్వాధీనం చేసుకోవచ్చు.

Pennsylvania: చాక్లెట్ ట్యాంకులో పడిపోయిన ఇద్ద‌రు వ్య‌క్తులు

ఈ నేపథ్యంలోనే 1960 నాటి నౌక‌ల విధ్వంస‌క‌ క్షిప‌ణుల (కేహెచ్‌-22)ను ర‌ష్యా వాడుతుంద‌ని బ్రిటిష్ ప్ర‌భుత్వం భావిస్తోంది. అయితే, ఈ క్షిప‌ణుల‌ను ఉక్రెయిన్‌లోని ఏ ప్రాంతంలో ర‌ష్యా మోహ‌రించిందన్న విష‌యాన్ని చెప్ప‌లేదు. ఉక్రెయిన్ కూడా ఈ అంశంపై స్పందించ‌లేదు. అయితే, ఉక్రెయిన్‌లోని ఓ గ‌వ‌ర్న‌ర్ దీనిపై మాట్లాడుతూ… తూర్పు లుహాన్స్క్ ప్రావిన్స్‌లోని వృబివ్కా, సీవీరోడోనెట్స్క్, లిసిచాన్స్క్ న‌గ‌రాల్లో ర‌ష్యా ప్ర‌మాద‌కర ఆయుధాలు వాడుతోంద‌ని చెప్పారు. ఆ ఆయుధాల వ‌ల్ల‌ పెద్ద ఎత్తున ప్రాణ‌న‌ష్టం సంభ‌విస్తోంద‌ని తెలిపారు.