Siberia : మంచులో వింత జీవి..24 వేల ఏళ్లనుంచి ప్రాణంతోనే ఉంది..

ఓ జీవి గత 24 వేల ఏళ్లనుంచి జీవించే ఉన్నట్లుగా గుర్తించారు పరిశోధకులు. రష్యాలోని సైబీరియాలో రోటిఫెర్‌ అనే ఒక మైక్రోస్కోపిక్‌ ఓ వింత జీవిని గుర్తించారు పరిశోధకులు. అసలు ఇది అన్నేళ్లపాటు ఎలా జీవించి ఉంది అనే అంశంపై రష్యాలోని సోయిల్‌ సైన్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధన చేసి ఓ డాక్యుమెంట్‌ రిలీజ్‌ చేశారు.

Siberia : మంచులో వింత జీవి..24 వేల ఏళ్లనుంచి ప్రాణంతోనే ఉంది..

Russia Northeastern Siberia Microscopic Animal Survived 24000 Years Frozen In The Siberian Permafrost

Microscopic animal in Russia : మనిషి అయితే 100 ఏళ్లు..కొన్ని రకాలు జంతువులైతే..100 నుంచి 150 ఏళ్లు మహా అయితే 200 ఏళ్లు బతుకుతాయి.కానీ ఏకంగా వందలు కాదు వేల ఏళ్లు బతికి ఉన్న జీవిని ఎక్కడైనా చూశారా?పోని కనీసం విన్నారా?అంటే లేదనే చెబుతాం.కానీ ఓ జీవి మాత్రం గత 24 వేల ఏళ్లనుంచి జీవించే ఉన్నట్లుగా గుర్తించారు పరిశోధకులు. బీరియాలో రోటిఫెర్‌ అనే ఒక మైక్రోస్కోపిక్‌ ఓ వింత జీవిని గుర్తించారు పరిశోధకులు. దీన్ని ‘వీల్‌ యానిమాల్‌క్యూల్‌’ అని కూడా అంటారట. అసలు ఇది అన్నేళ్లపాటు ఎలా జీవించి ఉంది అనే అంశంపై రష్యాలోని సోయిల్‌ సైన్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధన చేసి ఓ డాక్యుమెంట్‌ రిలీజ్‌ చేశారు.

క్రిప్టోబేసిస్‌ అనే విధానం ద్వారా ఈ మల్టీ సెల్యులర్‌ యానిమిల్స్‌ వేల సంవత్సరాలు బతకగలుగుతున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మెటబాలిజంను పూర్తిగా ఆపేయడం వల్ల ఇలా వేల ఏళ్ల తరబడి ఆ జీవి ప్రాణంతో ఉండి ఉంటుందని చెబుతున్నారు.ఈ జీవికి ఉండే చిన్నపాటి జుట్టు చక్రంలా తిరిగి ఉంటుంది. అందుకే దానికి వీల్‌ అనే అర్థం వచ్చేలా ‘వీల్‌ యానిమాల్‌క్యూల్స్‌’ అంటారని తెలిపారు.ఇది ప్రపంచంలోనే అత్యంత నిరోధక జంతువు అని..ఇది విపత్కర పరిస్థితులను కూడా ఎదుర్కోగలదని తెలిపారు. ఎంత ఆకలిగా ఉన్నా..తీవ్రమైన ఆమ్ల వాతావరణమైనా..ఆక్సిజన్ లేకపోయినా నిర్జలీకరణ పరిస్థితుల్లో కూడా జీవించగలదని తెలిపారు.

రష్యాకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఈశాన్య సైబీరియాలో సరికొత్త డ్రిల్లింగ్‌ టెక్నిక్స్‌తో శాంపిల్స్‌ను సేకరించారు. అలా 11 అడుగులకు కింద సేకరించిన శాంపిల్స్‌లో ఈ రోటిఫెర్స్‌ కనిపించిందట. ఏదో వింతగా కనిపిస్తోందని అనుమానించిన శాస్త్రవేత్తలు దానిని రేడియో కార్బన్‌ డేటింగ్‌ విధానంతో పరిశీలించారు. నాన్ని వినియోగించారు. అలా పరిశీలించాక ఆ రోటిఫెర్స్‌ 24 వేళ్ల ఏళ్లు గడిచినా ఇంకా బతికి ఉందని గుర్తించిన శాస్త్రవేత్తలు కూడా షాక్ అయ్యారు.

ఈ విషయాన్నే వాళ్లు డాక్యుమెంట్‌లో వెల్లడించారు. ఇలా మంచులో ఏళ్ల తరబడి ఉన్నా ప్రాణాలు నిలుపుకునే జంతువులు కొన్ని ఉన్నాయి. వాటిలో వాటర్‌ బేర్స్‌గా పిలుచుకునే టార్డిగ్రేడ్స్‌ ఒకటి. మంచులో గడ్డకట్టుకుపోయినా అవి ప్రాణాలతో ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు రోటిఫెర్స్‌ 24 వేల ఏళ్ల తర్వాత కూడా జీవించి ఉండటం కనుగొన్నారు. మరోవైపు రష్యన్‌ బృందం మరిన్నిజీవుల మీద ఈ తరహా ప్రయోగాలు చేస్తున్నారు. అలాంటి వాతావరణంలో ఎలా స్పందిస్తాయనేది తెలుసుకోబోతున్నారు.