Sputnik V : మా వ్యాక్సిన్ ఫార్ములాను దొంగిలించారు..! రష్యాపై తీవ్ర ఆరోపణలు

రష్యా.. కరోనా వ్యాక్సిన్ ఫార్ములాను దొంగిలించిందా? వాళ్లు సొంతంగా టీకాను అభివృద్ది చేయలేదా? వ్యాక్సిన్ బ్లూప్రింట్ ను రష్యా చోరీ చేసిందనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయా? అంటే అవుననే అం

Sputnik V : మా వ్యాక్సిన్ ఫార్ములాను దొంగిలించారు..! రష్యాపై తీవ్ర ఆరోపణలు

Sputnik V Vaccine

Sputnik V Vaccine : రష్యా.. కరోనా వ్యాక్సిన్ ఫార్ములాను దొంగిలించిందా? వాళ్లు సొంతంగా టీకాను అభివృద్ది చేయలేదా? వ్యాక్సిన్ బ్లూప్రింట్ ను రష్యా చోరీ చేసిందనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయా? అంటే అవుననే అంటోంది ఓ నివేదిక.

యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనావైరస్‌ మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ ను ప్రపంచంలో తొలుత తయారు చేసిన దేశం రష్యా. స్పుత్నిక్ వి పేరుతో రష్యా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసింది. అయితే, ప్రస్తుతం ఈ టీకా తయారు చేస్తున్న రష్యా కంపెనీ జెమాలయ నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ.. దోపిడీకి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఒక నివేదిక ప్రకారం, ఆక్స్‌ఫర్డ్ – ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ బ్లూప్రింట్‌ను రష్యన్ గూఢచారులు దొంగిలించారని, అదే ఫార్ములా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తయారీకి ఉపయోగించారని సమాచారం.

UPSC : బీటెక్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. దరఖాస్తుకు రేపే లాస్ట్

ది సన్ నివేదిక ప్రకారం, ఆక్స్‌ఫర్డ్ – ఆస్ట్రాజెనెకా కొవిడ్-19 వ్యాక్సిన్ ఫార్ములాను రష్యా దొంగిలించిందని, సొంత స్పుత్నిక్ వ్యాక్సిన్ తయారీకి ఉపయోగించిదని బ్రిటన్‌ మంత్రులకు సమాచారం ఉందట. రష్యా కోసం పనిచేస్తున్న గూఢచారులు.. ఆస్ట్రాజెనెకా కంపెనీ నుంచి కోవిషీల్డ్ డిజైన్‌ను దొంగిలించినట్లు తమ దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయని మంత్రులకు కొన్ని వర్గాలు చెప్పినట్లు తెలుస్తోంది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొన్ని నెలల క్రితం స్పుత్నిక్ వి కరోనా వ్యాక్సిన్ పొందారని వెల్లడించిన సమయంలోనే ఈ వాదన తెరపైకి వచ్చింది. రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్ ఆక్స్‌ఫర్డ్ డిజైన్ చేసిన టీకా తరహా టెక్నాలజీని ఉపయోగిస్తుందని నివేదిక తెలిపింది. దీని తర్వాత లోతుగా విచారణ చేపట్టిన బ్రిటన్‌ భద్రతా బృందాలు.. కచ్చితంగా కాపీ చేశారన్న నిర్ధరణకు వచ్చినట్లు సమాచారం.

AICTE : విద్యార్థులకు శుభవార్త.. నెలకు రూ.12,400.. అర్హతలు, దరఖాస్తు విధానం..

భద్రతా వర్గాల ప్రకారం, UK లోని మాస్కో మోల్ భౌతికంగా అత్యంత రహస్య డిజైన్‌ను పొందింది – ఇది ఫార్మా దిగ్గజం ల్యాబ్ లేదా ఫ్యాక్టరీ నుండి వచ్చిన కాగితమా, లేదా పరీక్ష కోసం దేశం నుంచి అక్రమంగా తరలించిన తుది aషధం యొక్క సీసా కాదా అనేది అస్పష్టంగా ఉంది.

బ్రిటిష్ శాస్త్రవేత్తలు తాము వ్యాక్సిన్ పరిశోధన ప్రారంభించినట్లు వెల్లడించిన ఒక నెల తర్వాత, మార్చి 2020 లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో రష్యన్ హ్యాకర్లు అనేక సైబర్ దాడులకు ప్రయత్నించారని MI5 కార్యకర్తలు గతంలో ఆరోపించారు. 2020 ఏప్రిల్‌లో ఆక్స్‌ఫర్డ్/AZ మొదటి మానవ ప్రయోగాల ప్రారంభాన్ని ప్రకటించింది. మరుసటి నెలలోనే తమ సొంత వ్యాక్సిన్‌ను కనుగొన్నట్లు రష్యా ప్రకటించింది. ఆపై ఆగస్టు నెలలో.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. ప్రపంచంలో తొలిసారిగా కరోనా బారి నుంచి కాపాడే వ్యాక్సిన్ ను రష్యా అభివృద్ధి చేసినట్లు ప్రకటించారు.

రష్యా అభివృద్ధి చేసినట్లు చెప్పుకుంటున్న స్పుత్నిక వ్యాక్సిన్ సైతం యూకే అభివృద్ధి చేసిన టీకా మాదిరే పని చేస్తోంది. రెండూ కూడా వైరల్ వెక్టార్ టీకాలే. యూకేలో వ్యాక్సిన్ కు సంబంధించి ప్రారంభ మానవ ప్రయోగాలు స్టార్ట్ అయిన సమయంలోనే రష్యా గూఢచారులు వ్యాక్సిన్ బ్లూప్రింట్ ను చోరీ చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు.