ఆగస్టులో కరోనా వ్యాక్సిన్ – రష్యా

  • Published By: madhu ,Published On : July 20, 2020 / 07:05 AM IST
ఆగస్టులో కరోనా వ్యాక్సిన్ – రష్యా

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టడానికి రష్యా వ్యాక్సిన్ వచ్చేస్తోంది. ఇందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. ఆగస్టు 03వ తేదీ రష్యా, సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ లో ప్రజల సమక్షంలో ఫేజ్ 3 ట్రయల్స్ చేయనున్నారు.

కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనుక్కొనే విషయంలో ప్రెసిడెంట్ పుతిన్ ప్రధానంగా ఫోకస్ పెట్టారు. గత కొన్ని రోజులుగా వ్యాక్సిన్ కనిపెట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు.

ప్రపంచంలోనే వ్యాక్సిన్ కనిపెట్టిన దేశంగా రష్యా నిలుస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే…మూడో..చివరి దశ ట్రయల్స్ క్లియర్ కావడానికి ముందే ప్రజలకు అందుబాటులో వ్యాక్సిన్ ను ఉంచుతామని రష్యా ఆరోగ్య మంత్రి వెల్లడిస్తున్నారు.

రోగ నిరోధక శక్తి తగ్గించే అవకాశాలను పరీక్షించడం జరుగుతోందని, దేశీయంగా 30 మిలియన్ డోస్ లు, విదేశాల్లో 17 మిలియన్ డోస్ లు ఉత్పత్తి చేస్తామన్నారు. Russia’s Defense Ministry’s Gamalei Institute of Epidemiology and Microbiology అభివృద్ధి చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసినట్లు రష్యా Sechenov University ప్రకటించింది.

మానవ శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపెట్టిందని, మొదటి దశ ట్రయల్స్ క్లియర్ చేశామని యూనివర్సిటీ డైరెక్టర్ Alexander Lukashev వెల్లడించారు. కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు భారత్ తో సహా ఎన్నో దేశాలు ప్రయత్నాలు జరుగుతున్నాయనే సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ రష్యా పూర్తి చేసింది.

అయితే..రష్యాపై యూకే, కెనడా దేశాల సంచలన ఆరోపణలు చేశాయి. కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన సమాచారాన్ని రష్యా తమ దేశాల నుంచి దొంగిలించే ప్రయత్నాలు చేస్తోందని ఆ దేశాలు ఆరోపించాయి. ఈ క్రమంలోనే ఆగస్టు నెలలో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని రష్యా ప్రకటించడం గమనార్హం.

రష్యాలో 7,50, 000 కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదైన దేశాల్లో రష్యా నాలుగో దేశంగా నిలిచింది. మరి..వ్యాక్సిన్ వస్తుందో లేదో తెలుసుకోవడానికి కొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.