Russia Ukraine War : పుతిన్ మరో కఠినమైన నిర్ణయం.. రష్యా తీర జలాల్లో న్యూక్లియర్ డ్రిల్స్‌కు ఆదేశాలు!

Russia Ukraine War : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. రష్యా తీర జలాల్లో న్యూక్లియర్ డ్రిల్స్‌కు ఆదేశాలు జారీ చేశారు.

Russia Ukraine War : పుతిన్ మరో కఠినమైన నిర్ణయం.. రష్యా తీర జలాల్లో న్యూక్లియర్ డ్రిల్స్‌కు ఆదేశాలు!

Russia Ukraine War Russia Holds Drills With Nuclear Subs, Land Based Missiles

Updated On : March 2, 2022 / 12:01 PM IST

Russia Ukraine War : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. రష్యా తీర జలాల్లో న్యూక్లియర్ డ్రిల్స్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే తీర జలాల్లో వ్యూహత్మక ప్రాంతాలకు రష్యా సబ్ మెరైన్లు చేరుకున్నట్టు తెలుస్తోంది. రష్యా చేపట్టే న్యూక్లియర్ డ్రిల్స్‌లో పలు న్యూక్లియర్ సబ్ మెరైన్లు పాల్గొంటున్నాయి. సైబిరియా మంచు అడవుల్లో మొబైల్ లాంచర్లను రష్యన్ ఆర్మీ మోహరించింది. బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించేందుకు అవసరమైన లాంచర్లను కూడా మోహరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ విషయాన్ని రష్యా నార్తన్ ఫ్లీట్ అధికారికంగా ప్రకటించింది.

ప్రపంచ దేశాల కఠినమైన ఆంక్షలను పట్టించుకోని పుతిన్ ఇప్పటికే అణు ప్రయోగానికి సిద్ధమేనని ప్రకటించారు. అణు ప్రయోగానికి పుతిన్ పాల్పడితే ప్రపంచ దేశాలు తీవ్రమైన పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని ఇప్పటికే పలుమార్లు ప్రపంచ దేశాలు హెచ్చరించాయి. అయినా పుతిన్ ఏమాత్రం అదరడం లేదు.. బెదరడం లేదు. పైగా తన సైన్యాన్ని యుక్రెయిన్ పై మరింత తీవ్రతరం చేస్తున్నారు.

యుక్రెయిన్ లొంగిపోవాలని పుతిన్ హెచ్చరించినా ప్రతిఘటిస్తూనే ఉండటంతో చివరి అస్త్రంగా అణు ప్రయోగానికి పుతిన్ సన్నద్ధమవుతన్నట్టు తెలుస్తోంది. అందులోభాగంగానే న్యూక్లియర్ డ్రిల్స్ చేసేందుకు ఆదేశాలు జారీ చేసినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.

Russia Ukraine War Russia Holds Drills With Nuclear Subs, Land Based Missiles (1)

Russia Holds Drills With Nuclear Subs, Land Based Missiles

పుతిన్ వ్యూహం ఏంటో? :
యుక్రెయిన్‌లో రష్యా యుద్ధం నేపథ్యంలో దేశంలోని అణ్వాయుధ బలగాలను పుతిన్ అప్రమత్తం చేసినట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులతో ఆయుధాలను న్యూక్లియర్ సబ్ మెరైన్లతో వ్యూహాత్మక బాంబర్లను రష్యా సిద్ధం చేస్తోంది. యునైటెడ్ స్టేట్స్, రష్యా ప్రపంచంలోనే రెండు అతిపెద్ద అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి.

పుతిన్ ఆదేశాల వెనుక ఎలాంటి వ్యూహం ఉందనేది అస్పష్టంగా ఉంది. అమెరికాతో పోల్చితే.. రష్యా అణు ప్రయోగాలకు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులపై ఎక్కువగా ఆధారపడుతోంది. వీటి కోసం మొబైల్ లాంచర్‌లను వినియోగిస్తుంటుంది. అలాంటిది పుతిన్ వ్యూహం అణు ప్రయోగమేనా కాదా అనేది అంచనా వేయడం చాలా కష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పుతిన్ ఆదేశాలతో మరింత ఉద్రికత్తలను పెంచుతోంది.

మరోవైపు.. యుక్రెయిన్ ప్రధాన నగరాలపై రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. కీవ్ నగరానికి సరిహద్దులో చొరబడిన రష్యా బలగాలు అక్కడి నుంచే దాడులకు పాల్పడుతున్నాయి. కీవ్ నగర జనావాసాలపై వైమానిక దాడులతో తెగబడుతున్నాయి. యుక్రెయిన్ సైన్యం కూడా దీటుగా ఎదుర్కొంటోంది. రష్యా వైమానిక దాడులతో కీవ్ నగరంలో విధ్వంసం సృష్టిస్తోంది. తాజాగా రష్యా జరిపిన వైమానిక దాడుల్లో కీవ్ నగరంలోని ప్రధాన టీవీ టవర్ ధ్వంసమైంది. ఈ దాడిలో అక్కడే ఉన్న ఐదుగురు మృతిచెందినట్టు యుక్రెయిన్ అధికారులు ప్రకటించారు.

Read Also : Russia Ukraine War : యుక్రెయిన్‌ను కాపాడుతాం.. పుతిన్ అంతు చూస్తాం.. రష్యా విమానాలపై బైడెన్ ఆంక్షలు!