Russia Ukraine War : యుక్రెయిన్‌ను కాపాడుతాం.. పుతిన్ అంతు చూస్తాం.. రష్యా విమానాలపై బైడెన్ ఆంక్షలు!

Russia Ukraine War : అమెరికా రష్యాపై ఆంక్షలు విధించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యా విమానాలపై అమెరికా గగనతలంలోకి ప్రవేశించకుండా ఆంక్షలను విధిస్తున్నట్టు ప్రకటించారు.

Russia Ukraine War : యుక్రెయిన్‌ను కాపాడుతాం.. పుతిన్ అంతు చూస్తాం.. రష్యా విమానాలపై బైడెన్ ఆంక్షలు!

Russia Ukraine War Joe Biden Announces Closing Off American Airspace To All Russian Flights

Russia Ukraine War : యుక్రెయిన్‌ రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. తమ దేశంపై దండెత్తివచ్చిన పుతిన్ సేనలపై యుక్రెయిన్ సైన్యం విరుచుకుపడుతోంది. ప్రపంచ దేశాలు హెచ్చరించినా.. కఠిన ఆర్థిక ఆంక్షలు విధించినా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం ఎంతమాత్రం వెనక్కి తగ్గడం లేదు. రోజురోజుకీ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నారు. రష్యా చర్యలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే అవసరమైతే అణుబాంబు కూడా ప్రయోగించడానికి వెనుకాడేది లేదని పుతిన్ కూడా గట్టిగానే హెచ్చరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు పుతిన్ చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

అమెరికా గగనతలంలో రష్యా విమానాలపై నిషేధం.. 
ఇప్పటికే నాటో దేశాలు రష్యాపై పలు ఆంక్షలు విధించగా.. తాజాగా అమెరికా కూడా రష్యాపై ఆంక్షలు విధించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యాపై ఆంక్షలను విధిస్తున్నట్టు ప్రకటించారు. రష్యా విమానాలపై అమెరికా గగనతలంలోకి ప్రవేశించకుండా ఆంక్షలను విధిస్తున్నట్టు ప్రకటించారు. స్టేట్ ఆఫ్ యూనియన్ అడ్రెస్‌లో బైడెన్ ఈ కీలక ప్రకటనను చేశారు.

యుక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన పుతిన్‌కు బైడెన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. యుక్రెయిన్‌పై రష్యా దాడులు దుర్మార్గమన్నారు. యుక్రెయిన్‌లో ప్రతి అంగుళాన్ని కాపాడుతామని, అలాగే అక్కడి ప్రజలకు మద్దతుగా నిలుస్తామని బైడెన్ భరోసా ఇచ్చారు. యుక్రెయిన్ భూభాగంలో ఒక్క అంగుళాన్ని కూడా పోనివ్వమని రష్యా తీరుపై బైడెన్ విరుచుకుపడ్డారు.

Russia Ukraine War Joe Biden Announces Closing Off American Airspace To All Russian Flights (1)

Russia Ukraine War : Joe Biden Announces Closing Off American Airspace To All Russian Flights

Russia Ukraine War : పుతిన్‌ను ప్రపంచ దేశాలు ఏకాకిని చేయాలి..
ఇప్పటికే రష్యాను ప్రపంచంలో ఏకాకిని చేశామని, ఇప్పుడు యుక్రెయిన్‌పై దురాక్రమణ చర్యలకు పాల్పడిన పుతిన్ ను కూడా ప్రపంచ దేశాలు ఏకాకిని చేయాలన్నారు. పుతిన్ చర్యలకు భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదన్నారు. యుక్రెయిన్ ను కాపాడుతామని, రష్యా అంతు చూస్తామని చెప్పారు. పుతిన్ లాంటి నియంతల భరతం పడతామని బైడెన్ ప్రకటించారు.

యుక్రెయిన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ రష్యా వశం కానివ్వమని బైడెన్ ప్రకటించారు. అమెరికాతో పాటు నాటో దేశాలు యుక్రెయిన్‌కు అండగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. యుక్రోయిన్ వీరోచితంగా పోరాడుతోందని, పుతిన్ భారీ మూల్యం చెల్లించుకునే రోజు వచ్చిందని అన్నారు. రష్యా బలగాలను దీటుగా ఎదుర్కొంటున్న యుక్రెయిన్ల పోరాటం వృథాపోదని బైడెన్ స్పష్టం చేశారు.

Read Also : Olena Zelenska : నాకు భయం, కన్నీళ్లు రావు.. నా భార్త జెలెన్ స్కీతో ఇక్కడే ఉన్నాం.. ఎక్కడికి పోలేదు..!