Russia-Ukraine War : యుక్రెయిన్‌లో భీకర యుద్ధం.. రష్యా క్షిపణులపై డ్రోన్లతో విరుచుకుపడుతున్న యుక్రెయిన్ సైన్యం..!
యుక్రెయిన్‌లో భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యా బలగాలు, యుక్రెయిన్ సైన్యం హోరాహోరీగా తలపడుతున్నాయి. దాడులకు ప్రతిదాడులు చేసేందుకు ఇరుదేశాల బలగాలు ఒకదానిపై మరొకటి విరుచుకుపడుతున్నాయి.

Russia Ukraine War The Situation On The Battlefield Is Changing Unexpectedly Day By Day
Russia-Ukraine War : యుక్రెయిన్‌లో భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యా బలగాలు, యుక్రెయిన్ సైన్యం హోరాహోరీగా తలపడుతున్నాయి. దాడులకు ప్రతిదాడులు చేసేందుకు ఇరుదేశాల బలగాలు ఒకదానిపై మరొకటి విరుచుకుపడుతున్నాయి. యుక్రెయిన్ దాడులు, ప్రతిదాడులతో మార్మోగిపోతోంది. రష్యా ప్రయోగించే క్షిపణులను సైతం యుక్రెయిన్ డ్రోన్లతో పేల్చేస్తూ యుక్రెయిన్ సైన్యం విరుచుకుపడుతోంది. యుక్రెయిన్ బలగాలను వెనక్కి తగ్గేందుకు రష్యా విచక్షణ రహింతగా యుక్రెయిన్ ప్రజల నివాస భవనాలపై క్షిపణులతో దాడి చేస్తోంది. రెండవ అంతస్తు భవనంలో చాలామంది మంటల్లో చిక్కుకున్నట్టు ఆ దేశ స్థానిక మీడియా నివేదించింది.
ప్రభుత్వాన్ని లొంగదీయడమే పుతిన్ వ్యూహం..
యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రభుత్వం వీలైనంత త్వరగా లొంగిపోయేలా చేయడమే రష్యా వ్యూహంగా కనిపిస్తోంది. ఎంతసేపటికి వెనక్కి తగ్గడం లేదు. యుక్రెయిన్ సైన్యం ఎంతగా ప్రతిఘటిస్తున్నా రష్యా బలగాలు ముందుకు దూసుకొస్తూనే ఉన్నాయి. ఇప్పటికే సగానికి పైగా కీవ్ నగరంలోకి రష్యా బలగాలు చొచ్చుకుని వచ్చాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ అసలు వ్యూహం.. యుక్రెయిన్ ప్రభుత్వాన్ని లొంగదీసుకోవడమే..అలా చేస్తే తప్పా రష్యా అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే పుతిన్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే చర్చలకు ఆహ్వానించినప్పటికీ కూడా ప్రభుత్వం లొంగిపోయిన అధికారాన్ని యుక్రెయిన్ మిలటరీకి అప్పగించాలని డిమాండ్ వినిపిస్తున్నారు.
రష్యా దాడిని తీవ్రంగా ఖండించిన అధ్యక్షుడు జెలెన్ స్కీ శాంతి చర్చల ప్రతిపాదనతో ముందుకు వచ్చినప్పటికీ దేశాన్ని కాపాడుకునే క్రమంలో ఆత్మరక్షణ కోసం రష్యా బలగాలపై ప్రతిఘటన తప్పదని హెచ్చరిక పంపారు. దేశాన్ని, పౌరులను కాపాడుకునేందుకు తమ పోరాటం, ప్రతిఘటన ఆగదనే సంకేతాలను పంపించారు జెలెన్ స్కీ.. దేశంపై దండెత్తి వచ్చిన రష్యా బలగాలను చూసి ప్రాణభయంతో పారిపోకుండా యుక్రెయిన్ దేశంలోనే ఉన్నారు. రష్యా సైన్యాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు తమ దేశ ఆర్మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ ముందుకు సాగుతున్నారు.
జాతీయ స్థాయిలో యుక్రెయిన్ ప్రతిఘటన పెరగకుండా అడ్డుకోవడం రష్యా లక్ష్యంగా కనిపిస్తోంది. స్వల్ప కాలంలోనే రష్యా కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తోంది. అప్పుడే సైనిక, రాజకీయంగా తమ హస్తగతం అవుతుంది. అదే వ్యూహాత్మకంగా రష్యా ముందుకు సాగుతోంది. అయితే, రష్యా దండయత్ర అనుకున్నట్లు సాగనివ్వడం లేదు యుక్రెయిన్.. యుక్రెయిన్ నుంచి ఎదురయ్యే ప్రతిఘటన బలంగా ఉండటంతో రష్యా బలగాలకు మరింత కష్టతరంగా మారింది. యుక్రెయిన్ ఎదురుదాడిలో ఇప్పటివరకూ వందలాది రష్యన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని బ్రిటన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. వందలాది సైనిక బలగాలను కోల్పోయినప్పటికీ రష్యా మాత్రం అదే లక్ష్యంతో ముందుకు దూసుకెళ్తోంది. ఇక రష్యన్ బలగాలు, యుక్రెయిన్ బలగాలకన్నా మూడు రెట్లు ఎక్కువ ఉన్నాయి. యుక్రెయిన్ సైనిక నాయకత్వం చాలా బలమైనది కూడా. రష్యా బలగాలను ప్రతిఘటిస్తూ ఎన్నిరోజులూ యుక్రెయిన్ నిలదొక్కుకోగలదు అనేది చూడాలి.
Read Also : North Korea : అమెరికా వల్లనే యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర.. అగ్రరాజ్యంపై ఉత్తరకొరియా ఆగ్రహం!