Russia-ukraine war : దేశం కోసం యుక్రెయిన్ సైన్యంలో చేరుతున్న అథ్లెట్లు..గన్ పట్టి రంగంలోకి దిగిన షూటింగ్

మాతృదేశం కోసం యుక్రెయిన్ సైన్యంలో చేరుతున్న అథ్లెట్లు.

Russia-ukraine war : దేశం కోసం యుక్రెయిన్ సైన్యంలో చేరుతున్న అథ్లెట్లు..గన్ పట్టి రంగంలోకి దిగిన షూటింగ్

Ukrainian Athletes Join Military After Russian Invasion (1)

Ukrainian athletes join military after Russian invasion : మాతృదేశం కోసం యుక్రెయిన్ లో సామాన్యప్రజలే సైనికులుగా మారుతున్నారు. అదే బాటలోపయనిస్తున్నారు యుక్రెయిన్ క్రీడాకారులు కూడా. రష్యాపై పోరాటానికి మేము కూడా సిద్ధం అంటున్నారు. మోడల్స్, మేయర్స్,క్రీడాకారులే కాకుండా అత్యంత సామాన్య ప్రజలు కూడా తమ దేశం కోసం పోరాడటామంటూ ముందుకొస్తున్నారు. వృద్ధులు పిల్లలు కూడా రష్యాపై పోరుకు సిద్ధముంటున్నారు. ఈక్రమంలో ఎంతోమంది యుక్రెయిన్ అథ్లెట్లు కూడా సైన్యంలో చేరుతూ దేశభక్తిని చాటుకుంటున్నారు.

Also read : Ukraine-Russia War: ‘యుక్రెయిన్‌ కోసం ఆయుధాలు పట్టనున్న ‘బాక్సింగ్‌ లెజెండ్ బ్రదర్స్‌’

ఇప్పటికే పలువురు క్రీడాకారులు సైన్యంలో చేరారు. బాక్సింగ్ లెజెండ్స్ వ్లాదిమిర్, విటాలీ క్లిష్కో సోదరులు యుక్రెయిన్ ఏజెంట్లుగా మారి.. రష్యాపై పోరాడటానికి సై అన్నారు. చైనా రాజధాని బీజింగ్‌లో ఇటీవల జరిగిన వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న దిమిత్రో పిద్రుచ్నీ ( Dmytro Pidruchnyi) మిలటరీ దుస్తులు ధరించి రంగంలోకి దిగాడు. దిమిత్రో మూడు ఒలింపిక్స్‌లలో పాల్గొన్నాడు. బయథ్లాన్ ( స్కీయింగ్, షూటింగ్) ప్రపంచ చాంపియన్‌ కూడా.

వింటర్ ఒలింపిక్స్ ముగించుకుని గత వారమే స్వదేశం చేరుకున్నాడు. ఇప్పుడు సైనిక దుస్తులు ధరించి దేశ రక్షణకు పోరాడుతున్నాడు. సైనిక దుస్తుల్లో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన దిమిత్రో.. తన స్వస్థలమైన టెర్నోపిల్‌లో ఉక్రెయిన్ జాతీయ రక్షకుడిగా విధులు నిర్వర్తిస్తున్నట్టు వెల్లడించాడు. టెన్నిస్ క్రీడాకారుడు సెర్హీ స్టాఖోవ్‌స్కీ, బాక్సింగ్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ అయిన వెసిల్ లొమచెంకో, హెవీ వెయిట్ ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండర్ యుసిక్‌లు కూడా ఆయుధాలు చేపట్టి దేశ రక్షణలో పాల్లొంటూ స్పూర్తిగా నిలుస్తున్నారు.

Also read : Russia-Ukraine war: మాతృదేశం కోసం తుపాకి పట్టిన మహిళా ఎంపీ..‘మహిళలు కూడా ఈ మట్టిని రక్షిస్తారు’అని ట్వీట్

ఇలా యుక్రెయిన్ లో ప్రతీ ఒక్కరు రష్యాపై పోరుకు సై అంటున్నారు.సామాన్యలు..ప్రముఖులు అనే తేడా లేకుండా రష్యన్లపై విరుచుకుపడుతున్నారు.ఓసామాన్య రైతు రష్యాకు చెందిన ఓ యుద్ధ ట్యాంకునే ఎత్తుకుపోయాడు. మరో సామాన్యుడు యుద్ధ ట్యాంకుకు అడ్డంగా పడుకుని నామీదనుంచి మీ పోరు చేయండీ అంటూ రష్యా యుద్ధ ట్యాంకుకు అడ్డంగా పడుకున్నాడు.

Also read :  Russia-Ukraine War: ‘మీ శవాల్లోంచి యుక్రెయిన్ మట్టిలో మా పొద్దుతిరుగుడు పువ్వులు వికసిస్తాయి’

మరోసామాన్యుడు యక్రెయిన్ సేనలను టార్గట్ గా నడిరోడ్డుపై పెట్టిన ల్యాండ్ మైన్ ను ఒట్టి చేతులతో తీసి పారేశాడు తమ సైనికులకు ఏమీ కాకూడదని..మరో సామాన్యుడు దూసుకొస్తున్న రష్యా యుద్ద ట్యాంకులకు ఎదురెళ్లి వాటిని ఆపటానికి యత్నించాడు. ఇలా ఎవరికి వారు రష్యాపై యుద్ధానికి సై అంటున్నారు. ఎక్కడిక్కడ రష్యా సైనికులపై దాడులకు దిగుతున్నారు.