Russia-Ukraine War: ‘మీ శవాల్లోంచి యుక్రెయిన్ మట్టిలో మా పొద్దుతిరుగుడు పువ్వులు వికసిస్తాయి’

'మీ రష్యన్ సైనికులు చనిపోయాక మీలోనుంచి మా యుక్రెయిన్ మట్టిలో మా పొద్దుతిరుగుడు శాంతి పువ్వులు వికసిస్తాయి'రష్యన్ సైనికుడికి సన్ ఫ్లవర్ గింజలు ఇచ్చిన మహిళ తూటాల్లాంటి మాటలు

Russia-Ukraine War: ‘మీ శవాల్లోంచి యుక్రెయిన్ మట్టిలో మా పొద్దుతిరుగుడు పువ్వులు వికసిస్తాయి’

Ukrainian Woman Gives Sunflower Seeds To Russian Soldier

Russia- UkraineWar : మూడవ రోజు కూడా రష్యా యుక్రెయిన్ పై బాంబుల దాడి చేస్తునే ఉంది.ఇప్పటికే పలు నగరాలను స్వాధీనంచేసుకుంది. ఈక్రమంలో మాతృదేశాన్ని రష్యా కబంధ హస్తాలోంచి రక్షించుకోవటానికి యుక్రెయన్ ప్రజలు కూడా ‘మేము సైతం’అంటున్నారు. రష్యన్ సైనికులు కనిపిస్తే కాల్చిపారేయాలి అన్నంత కోపంగా ఉన్నారు యుక్రెయిన్ వాసులు. ఈక్రమంలో ఓ సాధారణ యుక్రెయిన్ మహిళ రష్యా సైనికుడితో మాట్లాడిన తూటాల్లాంటి మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

‘‘నువ్వు ఎవరివి?..మా దేశంలో నీకేం పని? మా మట్టిమీద అడుగుపెట్టటానికి మీకెవరిచ్చారు అధికారం? మేం అడగకుండానే, మా గడ్డపై కాలుమోపి, ఎందుకీ మారణహోమం సృష్టిస్తున్నారు? అంటూ హెనీచెస్క్‌, ఖేర్సన్‌ ప్రాంతాల్లో జరుగుతోన్న మారణహోమంపై రష్యన్‌ సైనికుడిపై మాటల తూటాలతో దాడిచేసిందీ ఆ మహిళ. రష్యన్ సైనికులు యుక్రెయిన్ లో బాంబుల మోత మోగిస్తు మారణ కాండ సృష్టిస్తున్నా..ఆ సాధారణ మహిళ మాత్రం ఏమాత్రం భయపడటలేదు..సరికదా… అతనికి మాటల తూటాలతో ప్రశ్నించింది. ధైర్యంగా సవాల్ చేసింది. ఉక్రెయిన్‌ మహిళ వేసిన ఈ ప్రశ్నలు వేలాది యుద్ధట్యాంకుల్ని బద్దలు చేసే శక్తి ఉంది.

Also read : Zelenskyy : నన్ను తప్పించడం కాదు…చేతనైతే నా దేశాన్ని రక్షించండి’.. అమెరికాకు జెలెన్‌స్కీ స్ట్రాంగ్ కౌంటర్

ఓ వైపు యుద్ధ ట్యాంకులు..యుద్ధ విమానాలు బాంబుల మోత మోగిస్తుంటే.. మరో వైపు ఆమె రష్యాన్ సైనికుడిని తన ఈటెల్లాంటి మాటలతో నిలదీసింది. మా మట్టిమీద అడుగుపెట్టేందుకు మీకెవరిచ్చారీ అధికారం? మా గడ్డపై కాలుమోపి, ఎందుకీ మారణహోమం సృష్టిస్తున్నారు? అంటూ హెనీచెస్క్‌, ఖేర్సన్‌ ప్రాంతాల్లో జరుగుతోన్న మారణహోమంపై రష్యన్‌ సైనికుడిపై మాటల తూటాలతో దాడిచేసిందీ ఆ మహిళ.

Also read : Russia-Ukraine war: మాతృదేశం కోసం తుపాకి పట్టిన మహిళా ఎంపీ..‘మహిళలు కూడా ఈ మట్టిని రక్షిస్తారు’అని ట్వీట్

తమ దేశ దురాక్రమణకు పాల్పడుతూ, నిలువెల్లా అత్యాధునిక ఆయుధాలతో సాయుధుడై ఉన్న మాస్కో సైనికుడిని ఏ మాత్రం భయపడకుండా..నిలదీస్తోన్న ఈ మహిళ ఇప్పుడు కోటానుకోట్ల యుద్ధ వ్యతిరేకులకు ప్రత్యక్ష సాక్ష్యంలా నిలుస్తోంది. అంతేకాదు ఆ రష్యన్ సైనికుడికి ఆమె కొన్ని పొద్దుతిరుగుడు విత్తనాలు ఇచ్చి మరీ సవాల్ విసింది. ఆమె మాటల్లో ఉన్న వాడీ వేడీ..ధైర్యం తెగువ యుక్రెయన్ ప్రజల్నే కాదు యావత్ ప్రపంచాన్ని ప్రశ్నించినట్లుగా ఉన్నాయి. ఆమె ఆ రష్యన్ సైనికుడితో ఇలా అంది..

‘‘మా మాతృభూమిని ఆక్రమించే ముందు..ఇవిగో ఇవి తీసుకో..ఈ సన్ ఫ్లవర్ విత్తనాలు నీ జేబులో వేసుకో…నీ మరణానంతరం ఆ విత్తనాలు యుక్రెయిన్ గడ్డపై శాంతిపరిమళాల్ని వెదజల్లే పువ్వులై పూస్తాయవి’’ అంటూ విత్తనాలను అతనికి ఇచ్చింది. ఉక్రెయిన్‌ మట్టిలో పుట్టిన ఓ అత్యంత సాధారణ మహిళ రష్యా సైనికుడితో అన్న ఈ మాటలకు యుక్రెయిన్ లో మారణ కాండ సృష్టించే పుతిన్ సమాధానం చెప్పగలడా?అనిపిస్తోంది. ప్రపంచ యుద్ధానికి దారి తీసిన జర్మనీ నియంత హిట్లర్ లాంటి ఆలోచనలతో అరాచకం సృష్టిస్తున్న రష్యా అధినేత పుతిన్ సమాధానం చెప్పగలడా? అని అంటున్నారు నెటిజన్లు..

Also read : Indians Ukraine : యుక్రెయిన్‌లో భారతీయులకు విదేశాంగ శాఖ కొత్త మార్గదర్శకాలు

కాగా పొద్దుతిరగుడు (సన్ ఫ్లవర్ ) నూనె ఉత్పత్తిలో యుక్రెయిన్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. అందుకే యుక్రెయిన్ మహిళ రష్యన్ సైనికుడికి తమ దేశంపు ప్రధాన పంట అయిన సన్ ఫ్లవర్ విత్తనాలు ఇచ్చి తమ దేశపు గొప్పతనాన్ని చాటి చెప్పింది.